IPL: ఊచకోత.. ఇది అభిషేక్ ఊచకోత

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. అద్భుత శతకంతో హైదరాబాద్ పరాజయాల పరంపరకు చెక్ పెట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 245 పరుగులు చేసింది. అనంతరం అభిషేక్ సునామితో హైదరాబాద్ సునాయస భారీ లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం 55 బంతులు ఆడిన అభిషేక్ 141 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసి పెవిలియన్ చేరాడు. మిగిలిన లాంఛనాన్ని బ్యాటర్లు పూర్తి చేశారు.
పంజాబ్ బ్యాటర్ల విధ్వంసం
ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు పంజాబ్ కింగ్స్ భారీ లక్ష్యం ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (82; 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (36; 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదే జోరును కొనసాగిస్తూ క్రీజులో ఉన్నంతసేపు విధ్వంసం సృష్టించాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (42; 23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు.
అంతా అభిషేక్ ఊచకోతే
246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు బుల్లెట్ ఆరంభం దక్కింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ పంజాబ్ బౌలర్లను దంచికొట్టారు. వీరిద్దరూ 12 ఓవర్లకే 177 పరుగులు జోడించి విజయం ఖాయం చేశారు. హెడ్ 66 పరుగులు చేసి అవుటైనా అభిషేక్ మాత్రం చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సులతో 144 పరుగులు చేసి విజయం ముంగిట అవుటయ్యాడు. విజయ లాంఛనాన్ని క్లాసెన్, ఇషాన్ కిషన్ పూర్తి చేసి.. హైదరాబాద్ పరాజయాకు బ్రేక్ వేశారు.
40 బంతుల్లో సెంచరీ..
అభిషేక్ శర్మ ఇచ్చిన రెండు కష్టతరమైన క్యాచ్‌లను యుజ్వేంద్ర చాహల్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాలతో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. చాహల్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన అతను 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చాహల్ మరుసటి బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన హెడ్.. ఆ మరుసటి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 171 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com