ACA: ఆంధ్ర క్రికెట్‌కు కొత్త శకం

ACA: ఆంధ్ర క్రికెట్‌కు కొత్త శకం
X
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో కొత్త శకం.. ఏసీఏ నూతన ప్రధాన కోచ్‌గా గ్యారీ స్టేడ్.. స్టేడ్‌కు అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు

ఆం­ధ్ర క్రి­కె­ట్ అసో­సి­యే­ష­న్ చరి­త్ర­లో నూతన శకం ప్రా­రం­భ­మైం­ది. కొం­త­కా­లం­గా దే­శ­వా­ళీ క్రి­కె­ట్‌­లో స్థా­యి­ని కో­ల్పో­తు­న్న ఆం­ధ్ర జట్టు­కు మంచి రో­జు­లు వచ్చా­యి. వచ్చే దే­శ­వా­ళి సీ­జ­న్ నుం­చి ఆం­ధ్రా జట్టు­కు న్యూ­జి­లాం­డ్ మాజీ హెడ్ కోచ్ గ్యా­రీ స్టీ­డ్ మా­ర్గ­ని­ర్దే­శ­నం చే­య­ను­న్నా­డు. ఈ ని­ర్ణ­యం అభి­మా­ను­ల్లో కొ­త్త ఆశలు నిం­పిం­ది. ఆం­ధ్ర క్రి­కె­ట్ అసో­సి­యే­ష­న్ (ఏసీఏ) ఈ వి­ష­యా­న్ని అధి­కా­రి­కం­గా వె­ల్ల­డిం­చిం­ది. స్టీ­డ్‌­ను సం­ప్ర­దిం­చిన వెం­ట­నే ఆయన కో­చిం­గ్ బా­ధ్య­త­లు స్వీ­క­రిం­చ­డా­ని­కి అం­గీ­క­రిం­చా­ర­ని ఏసీఏ తె­లి­పిం­ది. జట్టు­ను బలో­పే­తం చే­యా­ల­న్న దృ­క్ప­థం­తో­నే ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­మ­ని సె­క్ర­ట­రీ సనా సతీ­శ్ బాబు స్ప­ష్టం చే­శా­రు. ప్ర­పం­చం­లో­నే అత్యు­త్తమ క్రి­కె­ట్ కో­చ్‌­ల­లో ఒక­రైన గ్యా­రీ స్టే­డ్ ఆం­ధ్ర క్రి­కె­ట్ జట్టు­కు ప్ర­ధాన కో­చ్‌­గా ని­య­మి­తు­ల­య్యా­రు. ఈ వి­ష­యా­న్ని మం­త్రి నారా లో­కే­ష్ సో­ష­ల్ మీ­డి­యా వే­ది­క­గా ప్ర­క­టిం­చా­రు.

గ్యారీ స్టేడ్ విజయ ప్రస్థానం

గ్యా­రీ స్టే­డ్ అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌­లో గొ­ప్ప పేరు ప్ర­ఖ్యా­తు­ల­ను సం­పా­దిం­చు­కు­న్నా­డు. ఆయన న్యూ­జి­లాం­డ్ జా­తీయ జట్టు­కు కో­చ్‌­గా పని­చే­సి ఆ జట్టు­తో అద్భు­త­మైన వి­జ­యా­ల­ను సా­ధిం­చా­రు. గ్యా­రీ స్టే­డ్ కో­చిం­గ్‌­లో న్యూ­జి­లాం­డ్ జట్టు ప్ర­పంచ టె­స్ట్ ఛాం­పి­య­న్ షి­ప్‌­ను గె­లు­చు­కు­ని ప్ర­పంచ క్రి­కె­ట్ చరి­త్ర­లో తన పే­రు­ను సు­వ­ర్ణా­క్ష­రా­ల­తో లి­ఖిం­చు­కుం­ది. అంతే కా­కుం­డా అనేక ఐసీ­సీ టో­ర్న­మెం­ట్ల­లో ము­ఖ్యం­గా ప్ర­పంచ కప్‌­ల­లో రన్న­ర­ప్‌­గా ని­లి­చి ని­ల­క­డైన ప్ర­ద­ర్శ­న­ను కన­బ­రి­చిం­ది. ఈ వి­జ­యా­లు గ్యా­రీ స్టే­డ్ వ్యూ­హా­త్మక నై­పు­ణ్యం, ఆట­గా­ళ్ల­లో స్ఫూ­ర్తి­ని నిం­పే సా­మ­ర్థ్యం, ఆధు­నిక క్రి­కె­ట్ పట్ల ఆయ­న­కు­న్న లో­తైన అవ­గా­హ­న­ను స్ప­ష్టం­గా సూ­చి­స్తా­యి.

స్వాగతించిన నారా లోకేశ్

గ్యా­రీ స్టే­డ్ రా­క­తో క్రి­కె­ట్ భవి­ష్య­త్తు మరింత ఉజ్వ­లం­గా మా­రు­తుం­ద­ని లో­కే­ష్ ఆశా­భా­వం వ్య­క్తం చే­శా­రు. ఆయన అను­భ­వం, మా­ర్గ­ద­ర్శ­క­త్వం రా­ష్ట్రం­లో­ని యువ క్రి­కె­ట­ర్ల­కు సరి­కొ­త్త శి­క్ష­ణ­ను అం­ద­స్తా­యి. "ఆయన నై­పు­ణ్యం మన యు­వ­త­ను ప్రో­త్స­హి­స్తుం­ది, ఆం­ధ్ర­ప్ర­దే­శ్ క్రీ­డా ప్ర­తి­ష్ఠ­ను పెం­చు­తుం­ది. మన క్రి­కె­ట్ ఆశ­ల­ను ప్ర­పంచ స్థా­యి­లో ని­ల­బె­డు­తుం­ది" అని లో­కే­ష్ తన సో­ష­ల్ మీ­డి­యా పో­స్ట్‌­లో పే­ర్కొ­న్నా­రు. ఈ ని­యా­మ­కం కే­వ­లం ఒక కోచ్ మా­ర్పు మా­త్ర­మే కాదు.. ఆం­ధ్ర క్రి­కె­ట్‌­కు ఒక కొ­త్త ది­శా­ని­ర్దే­శం. గ్యా­రీ స్టే­డ్ ఆధ్వ­ర్యం­లో రా­ష్ట్ర జట్టు అం­త­ర్జా­తీయ ప్ర­మా­ణా­ల­కు అను­గు­ణం­గా ఎది­గే అవ­కా­శం ఉంది. గ్యా­రీ స్టే­డ్‌ ప్ర­యా­ణం ఆం­ధ్ర­ప్ర­దే­శ్ క్రి­కె­ట్‌­కు ఓ ము­ఖ్య­మైన ముం­ద­డు­గు అవు­తుం­ద­ని లో­కే­ష్ పే­ర్కొ­న్నా­రు.

నిరాశ కలిగిస్తున్న జట్టు

ఒక­ప్పు­డు దే­శ­వా­ళీ­లో పోటీ ఇచ్చిన ఆం­ధ్ర జట్టు రెం­డు సం­వ­త్స­రా­లు­గా ని­రాశ కలి­గి­స్తోం­ది. 2022-23 సీ­జ­న్‌­లో రంజీ క్వా­ర్ట­ర్ ఫై­న­ల్ వరకు చే­రి­నా, అక్క­డే ఆగి­పో­యిం­ది. తర్వా­తి రెం­డు సీ­జ­న్ల­లో నా­కౌ­ట్ దశకు కూడా అర్హత సా­ధిం­చ­లే­క­పో­యిం­ది. రికీ భూయ్, శ్రీ­క­ర్ భరత్, ని­తీ­శ్ కు­మా­ర్ రె­డ్డి వంటి ఆట­గా­ళ్లు మె­రు­గైన వ్య­క్తి­గత ప్ర­ద­ర్శ­న­లు కన­బ­రు­స్తు­న్నా­రు. కానీ జట్టు సమి­ష్టి­త­త్వం లో­పిం­చ­డం పె­ద్ద సమ­స్య­గా మా­రిం­ది. ని­ర్ణా­యక మ్యా­చ్‌­ల­లో జట్టు ని­ల­బ­డ­లే­క­పో­యిం­ది.స్టీ­డ్ రా­క­తో ఆం­ధ్ర జట్టు మా­రు­తుం­ద­ని అభి­మా­ను­లు ఆశా­భా­వం వ్య­క్తం చే­స్తు­న్నా­రు.

Tags

Next Story