ACA: ఏసీఏ ప్రెసిడెంట్‌గా కేశినేని చిన్ని

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరోసారి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికయ్యారు. సర్వసభ్య సమావేశంలో సంఘ సభ్యులంతా చిన్నిని ప్రెసిడెంట్‌గా ప్రతిపాదించారు. అయితే, ఎలాంటి పోటీ లేకపోవడంతో ఆయనే మరోసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ACA ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనకు ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఏసీఏ కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబు.. మరో 34 మందితో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటైంది. . ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఏసీఏ నూతన కార్యవర్గం ఎన్నికైంది.. మూడేళ్లల్లో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తాం అన్నారు.. మౌలిక సదుపాయాలు కల్పించి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం.. ఎక్కువ మంది క్రీడాకారులను తయారు చేస్తాం.. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ నిర్వహిస్తామని వెల్లడించారు.. అసోసియేషన్ ప్రతిష్ట పెంచేలా మేం పనిచేస్తామని తెలిపారు. మరోవైపు ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ మాట్లాడుతూ.. 2025-28 కాల పరిమితికి ఏసీఏ ఎన్నిక జరిగింది.. ఒక్క వైస్ ప్రెసిడెంట్ మినహా అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారని వెల్లడించారు.. గత 11 నెలలుగా ఎఫెక్స్ కమిటీ సహకారంతో బాగా పని చేశారు.. విశాఖ స్టేడియం అభివృద్ధి, ఏపీఎల్ టోర్నీల నిర్వహణ సమర్థవంతంగా సాగింది.. ఇరవై లక్షల నుంచి నలభై లక్షలకు జిల్లా అసోసియేషన్లు పెంచాం.. కొంతమంది క్రీడాకారులను ఇంగ్లాండ్ పంపామని వెల్లడించారు.. రెడ్ బాల్, వైట్ బాల్ ఆట వల్ల క్రీడాకారులు కొంత గందరగోళంలో ఉన్నారు.. ఇది గుర్తించి వేర్వేరుగా క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాం అన్నారు..
కొత్తగా మరో క్రికెట్ స్టేడియం
ఏపీలో క్రీడాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగున్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసి.. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేలా అడుగులు వేస్తోంది. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా వాటాను కూడా ఏపీ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో క్రీడాకారులు, గ్రామీణ యువత కోసం ప్రతి నియోజకవర్గంలో స్టేడియం నిర్మించే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో స్టేడియం నిర్మించాలనేదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ క్రమంలోనే కర్నూలులో క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com