AJITH: దుబాయ్ కార్ రేసింగ్‌లో అజిత్ అరుదైన ఫీట్

AJITH: దుబాయ్ కార్ రేసింగ్‌లో అజిత్ అరుదైన ఫీట్
X
దుబాయ్ కారు రేసింగ్ పోటీల్లో అజిత్‌ టీమ్ మూడో స్థానం... ప్రముఖుల ప్రశంసలు

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కొత్త ఏడాదిలో ప్రత్యేకమైన విజయాన్ని అందుకున్నారు. ఇటీవల ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో తన స్వంత రేసింగ్ టీమ్‌ను స్థాపించిన ఆయన, తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో అజిత్‌ టీమ్ మూడో స్థానం సాధించి అందరి ప్రశంసలు పొందింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

లవ్ యూ అజిత్ కుమార్: రజనీకాంత్‌

దుబాయ్‌లో జరిగిన 24హెచ్ సిరీస్ కార్ రేస్‌లో అజిత్ కుమార్ రేసింగ్ 3వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంలో నటుడు రజనీకాంత్ తన X సైట్‌లో 'అభినందనలు మై డియర్ అజిత్‌కుమార్. నువ్వు సాధించావు. దేవుడు నిన్ను ఎప్పటికీ ఆశీర్వదిస్తాడు. లవ్ యూ' అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

అజిత్‌ను కౌగిలించుకున్న నటుడు మాధవన్

దుబాయ్ 24 హెచ్ కార్ రేస్‌లో పాల్గొన్న నటుడు అజిత్ కుమార్ బృందం మూడో స్థానంలో నిలిచింది. ఈ రేస్ తిలకించేందుకు హాజరైన నటుడు మాధవన్ అజిత్‌ను కౌగిలించుకుని అభినందనలు తెలిపారు. ఇక మాధవన్ తన ఎక్స్ పేజ్‌లో 'సో సో ప్రౌడ్.. వాట్ ఏ మ్యాన్. ది వన్ అండ్ ఓన్లీ.. అజిత్ కుమార్' అని పోస్ట్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ రేసులో సత్తా చాటిన అజిత్‌కు చాలా మంది ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు.

కేటీఆర్ ప్రశంసలు

దుబాయ్‌ కారు రేసింగ్‌లో తమిళ స్టార్ హీరో అజిత్ అదరగొట్టారు. ‘అజిత్‌ కుమార్ రేసింగ్‌’ పేరుతో ఇటీవల ఒక రేసింగ్‌ టీమ్‌ను ప్రకటించిన ఆయన.. దుబాయ్‌ కారు రేసింగ్‌లో పాల్గొని గ్రాండ్ విక్టరీ సాధించారు. అజిత్ కుమార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. రేసింగ్ మీద ఆయనకున్న ఫ్యాషనే విజయానికి చేరువ చేసిందని కొనియాడారు. ‘ఎంతో మందికి మీరు ఆదర్శం అజిత్ గారు’ అంటూ ట్వీట్ చేశారు.

Tags

Next Story