Sonu Sood : యావత్ దేశం గుండె బద్దలైంది.. కొనికా ఆత్మహత్య పై సోనూసూద్

Sonu Sood : జాతీయ షూటర్ కొనికా లాయక్ ఆత్మహత్య పై బాలీవుడ్ నటుడు సోనూసూద్ స్పందించాడు. " నాదే కాదు.. యావత్ దేశం గుండె బద్దలైంది. కొనికా వాగ్దానం నాకు ఇంకా గుర్తుంది. ఆమె ఒలంపిక్ పతాకాన్ని తీసుకొస్తానని నాతో చెప్పింది. కానీ ఈ రోజు అంతా అయిపోయింది." అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఆమెకి సంతాపం తెలిపాడు సోనూసూద్.
కాగా కొనికా కోల్‌కతాలో తాను ఉంటున్న హాస్టల్‌లో గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ కి ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ పోలీసులకి లభ్యమైంది. షూటింగ్‌లో రాణించలేకపోతున్నానని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో రాసుంది. కాగా కొనికా ఆత్మహత్య తోటి క్రీడాకారులని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకి తరలించారు. గడిచిన నాలుగు నెలల్లో నలుగురు క్రీడాకారులు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.
2021లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ నుంచి రూ. 2.70 లక్షల విలువైన జర్మన్ రైఫిల్‌ను బహుమతిగా పొందింది కొనికా.. జనవరిలో సోనూసూద్‌ను ట్యాగ్ చేసి ఓ ట్వీట్ చేసింది కొనికా... అందులో.. 11వ జార్ఖండ్ స్టేట్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో నేను రజతం, బంగారు పతకం సాధించానని, అయితే, ప్రభుత్వం నుంచి తనకి ఎలాంటి ఏమాత్రం సహాయం అందాలేదని పేర్కొంది.
దీనిపైన స్పందించిన సోనూసూద్.. రూ. 2.70 లక్షల విలువైన జర్మన్ రైఫిల్‌ను బహుమతిగా అందజేశారు. ప్రస్తుతం కోనికా కోల్‌కతాలో మాజీ ఒలింపియన్, అర్జున అవార్డు గ్రహీత జోయ్‌దీప్ కర్మాకర్ వద్ద శిక్షణ పొందుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com