AFG: క్రికెటర్ల మరణంపై భగ్గుమన్న క్రీడా ప్రపంచం

పాకిస్తాన్ వైమానిక దాడులు ఆఫ్ఘన్ క్రికెట్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పాక్టికా ప్రావిన్స్‌లో జరిగిన ఈ దాడిలో ముగ్గురు స్థానిక క్లబ్ క్రికెటర్లతో సహా ఐదుగురు మరణించారు. క్రికెటర్లు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. ప్రావిన్షియల్ రాజధాని షరానాలో జరిగిన స్థానిక టోర్నమెంట్ నుండి ఆటగాళ్లు అర్గున్ జిల్లాకు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రణించిన ఆటగాళ్లను ఆఫ్ఘన్ క్రికెట్ యొక్క గ్రాస్‌రూట్ హీరోలుగా అభివర్ణించింది. పాక్టికా వైమానిక దాడుల్లో దేశీయ ఆటగాళ్లు మరణించిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌లో జరగాల్సిన పాకిస్తాన్, శ్రీలంకతో కూడిన ముక్కోణపు T20 సిరీస్‌లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ఆటగాళ్ల మరణాల పట్ల నిరసనగా, జాతీయ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆఫ్ఘన్ స్టార్ క్రికెటర్ల ఆగ్రహం
ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు. రషీద్ ఖాన్ ట్విట్టర్లో స్పందిస్తూ.. “ఇటీవల ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడుల్లో పౌరులు మరణించడం నాకు చాలా బాధ కలిగించింది. ప్రపంచ వేదికపై తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న మహిళలు, పిల్లలు, యువ క్రికెటర్ల ప్రాణాలను బలిగొన్న విషాదం ఇది. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా అనాగరికం. పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌ల నుండి వైదొలగాలని ACB తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. దేశమే అన్నింటికంటే ముఖ్యం ” అని రాసుకొచ్చారు. “పక్తికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ జిల్లా చెందిన ముగ్గురు ఆటగాళ్లను పాకిస్తాన్ సైన్యం అమానుషంగా లక్ష్యంగా చేసుకుంది. ఈ భయంకరమైన దాడిపై మా బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. అప్ఘన్ క్రీడా వర్గాలకు, ఆటగాళ్లకు ఇది తీవ్రమైన నష్టం. వీరంతా దేశ గౌరవం కోసం ప్రాణాలను అర్పించారు. వీరి కుటుంబాలకు, పక్తికా ప్రజలకు మా సానుభూతి తెలియజేస్తున్నాం” అని ఏసీబీ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రాణాలు కోల్పోయిన ఆటగాళ్లను కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్గా గుర్తించారు. వీరితో పాటు మరో ఐదుగురు స్థానికులు కూడా మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. దాంతో నవంబర్‌లో జరగాల్సిన ట్రై టీ20 సిరీస్‌లో పాల్గొనబోమని బోర్డు ప్రకటించింది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా శ్రీలంక మూడో జట్టుగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com