పాక్‌తో సిరీస్.. అఫ్గన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం..!

Afghanistan vs Pakistan: ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఆ దేశంలో పరిస్థితులు భయానకంగా మారాయి. దాంతో ఆదేశం భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. పాకిస్థాన్- ఆఫ్గనిస్థాన్ మధ్య శ్రీలంక వేదికగా క్రికెట్ టోర్నీ వచ్చే నెలలో జరగాల్సివుంది. సెప్టెంబర్ 1 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలుకావాల్సి ఉంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా సెప్టెంబర్ 1న తొలి వన్డే, 3న రెండో వన్డే, 5న చివరి వన్డే జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాలిబన్ల నుంచి కూడా అనుకూల సంకేతాలు కూడా వచ్చాయి. క్రికెట్ మ్యాచులకు తాము వ్యతిరేకం కాదని వెల్లడించింది. సిరీస్ సజావుగా సాగుతుందని అంతాభావించారు. ఈ క్రమం ఆఫ్గన్ క్రికెట్ బోర్డు ఊహించని షాక్ ఇచ్చింది.
అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అఫ్గానిస్తాన్‌లో ఏర్పడిన పరిస్థితుల దృష్యా సిరీస్‌ను వాయిదా వేసినట్లు ఆఫ్గన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. తాలిబన్లు తాము క్రికెట్‌కు మద్దతిస్తామని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే తాలిబన్ ప్రకటన చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే అఫ్గన్ క్రికెట్ బోర్డు నుంచి సిరీస్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటన రావడం ఆశ్చర్యపరిచింది. దీనిపై తాలిబన్లు ఎలా స్పందిస్తారనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com