Cricket: బంగ్లాదేశ్‌ని ఓడించిన ఆఫ్ఘనిస్థాన్

పసికూన ట్యాగ్‌తో క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్, తన కంటే బలమైన బంగ్లాదేశ్ టీంని ఓడించింది. చిట్టగాంగ్‌లో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఆఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం(41 నాటౌట్), బౌలర్ ఫరూఖీ 3 వికెట్లతో ఆఫ్ఘాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
పలుమార్లు వర్షం ఆటంకం కలిగించిన మొదటి వన్డేలో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో ఓవర్లను 43కు కుందించారు. 164 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్‌లో బరిలో దిగిన ఆఫ్ఘాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జర్ధాన్ జాగ్రత్తగా ఆడారు. అడపా దడపా బౌండరీలు కొడుతూ 15.3 ఓవర్లలో 54 పరుగులు చేశారు. 83/2తో ఉన్న సమయంలో మళ్లీ భారీ వాన కురిసి మ్యాచ్ మొదలయ్యే పరిస్థితి లేకపోయింది. ఆ సమయానికి ఆఫ్ఘాన్ జట్టు డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 17 పరుగుల లీడ్‌లో ఉండటంతో ఆఫ్ఘానిస్థాన్‌ని విజేతగా ప్రకటించారు.
మొదట బ్యాటింగ్‌కి దిగిన బంగ్లాదేశ్‌ని ఆఫ్ఘాన్ బౌలర్ ఫజల్ ఫారూఖీ దెబ్బకొట్టాడు. కేవలం 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బంగ్లా బ్యాట్స్‌మెన్ తమకు 3 డ్రాప్ క్యాచ్ అవకాశాల్ని వచ్చినా కూడా వినియోగించుకోలేదు. తౌహిద్ హిద్రోయ్ ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. 20 ఓవర్ల దాకా లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ బ్యాటింగ్‌తో మెరుగ్గానే ఆడిన బంగ్లా తన పేవలమైన బ్యాటింగ్‌తో 3 వికెట్లకు 103 పరుగుల స్థితి నుంచి వెనువెంటనే వికెట్లు కోల్పోయి 169/9 కి చేరుకున్నారు. వర్షం ఆటంకానికి ముందు వరకు నెమ్మదిగా ఆడటంతో, వర్షం తర్వాత కొనసాగిన మ్యాచ్‌లో వేగంగా పరుగులు సాధంచలేకపోయారు. చివరి 20 ఓవర్లలో బంగ్లా కేవలం 3 పరుగుల రన్‌రేట్‌తో పరుగులు సాధించారంటేనే వారు ఎంత నెమ్మదిగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. షకీబుల్ హసన్(15) కూడా ప్రభావం చూపలేకపోయాడు.
ఆఫ్ఘాన్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్, ముజీబ్ రెహ్మీన్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఫజల్ ఫారూఖీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com