Prithvi Shaw: పృధ్వీ షా మరో విధ్వంసం

Prithvi Shaw: పృధ్వీ షా మరో విధ్వంసం
X
ఇంగ్లండ్‌ వన్డే కప్‌లో పరుగుల వరద... మరో మెరుపు శతకంతో మెరిసిన యువ బ్యాటర్‌

జాతీయ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న షా.. మరో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సెలెక్టర్ల తలుపు తట్టాడు. ఇంగ్లండ్‌ వన్డే కప్‌లో భారత యువ బ్యాటర్‌ పృథ్వీ షా(Prithvi Shaw in action ) పరుగుల వరద పారిస్తున్నాడు. గత మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ ఊచకోతను మరిచిపోకముందే షా.. మరో ధనాధన్‌ ఇన్నింగ్స్‌(Prithvi Shaw slams another century) ఆడాడు. మెరుపు శతకంతో తన జట్టుకు మరో విజయాన్ని అందించాడు. పృధ్వీ ఊచకోతతో సగం ఓవర్లు కూడా పూర్తి కాకుండానే జట్టు విజయం సాధించింది.


ఇంగ్లండ్‌ వన్డేకప్‌లో గత మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా మరో మెరుపు సెంచరీ చేశాడు. వన్డే కప్‌లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీషా 76 బంతుల్లో 125 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయంటే షా విధ్వంసం ఎలా సాగిందో చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్హం జట్టు నిర్ణీత ఓవర్లలో 198 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన నార్తంప్టన్‌షైర్‌ పృథ్వీ మెరుపులతో 25.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు 198 పరుగులు చేస్తే... పృధ్వీ ఒక్కటే 125 పరుగులు చేసి సత్తా చాటాడు.


వన్డే కప్‌ తొలి మ్యాచ్‌లోనూ క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw ) చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ విధ్వంసం సృష్టించాడు. తొలిసారి ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడుతున్న పృథ్వీ షా నార్తాంప్టన్ షైర్ జట్టు‍( Northamptonshire) తరఫున బరిలోకి దిగి సోమర్‌సెట్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. ఏ ఒక్క బౌలర్‌ను వదిలి పెట్టకుండా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్సర్ల (28 boundaries and 11 sixes )సాయంతో 244 పరుగులు( record-breaking double hundred) చేశాడు. షా ధాటికి నార్తంప్టన్‌షైర్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. సోమర్‌సెట్‌ బౌలర్లంతా షా ఊచకోతకు గురయ్యారు. ప్రతి బౌలర్‌ దాదాపు 9 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించుకున్నాడు.

అయితే ప్రస్తుతం టీమిండియాలోకి ఎంపిక కాకపోవడం గురించి తాను ఆలోచించడం లేదని పృథ్వీ షా(Prithvi Shaw )స్పష్టం చేశాడు. తన గురించి టీమిండియా సెలెక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారనే దాని గురించి నిజంగా ఆలోచించడం లేదని వెల్లడించారు. ఇంగ్లండ్‌ కౌంటీల్లో రాణించడంపైనే తన దృష్టి కేంద్రీకరించానని, ఇక్కడ మంచి సమయాన్ని గడపాలనుకుంటున్నానని డబుల్‌ సెంచరీ చేసిన అనంతరం అనంతరం వ్యాఖ్యానించాడు. నార్తంప్టన్‌షైర్ తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిందని వారు నిజంగా తనను బాగా చూసుకుంటున్నారని పృథ్వీ అన్నాడు.

Tags

Next Story