SIRAJ: సింగర్ తో డేటింగ్ వార్తలపై సిరాజ్ స్పష్టత

SIRAJ: సింగర్ తో డేటింగ్ వార్తలపై సిరాజ్ స్పష్టత
X
అమె తనకు సోదరితో సమానమన్న టీమిండియా పేసర్

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. స్టార్ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనై భోంస్లేతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జనై తన బర్త్ డేకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. అందులో సిరాజ్, జనై కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆ వార్తలపై సిరాజ్, జనై క్లారిటీ ఇచ్చారు. ‘మై డియర్ బ్రదర్’ అని తొలుత జనై ఇన్‌‌స్టాలో పోస్టు చేసింది. జనై పోస్టుకు సిరాజ్ రిప్లయ్ ఇచ్చాడు. జనై భోస్లే తనకు చెల్లెలు లాంటిదని చెప్పాడు. ఆమెలాంటి సోదరి తనకెవరూ లేరంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరి లవ్ రూమర్స్‌కి ఫుల్‌స్టాఫ్ పడింది.

ఇంతకీ సిరాజ్ ఏమన్నాడంటే

దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దని.. జనై తనకు చెల్లెలు లాంటిదని ఇన్‌స్టా స్టోరీలో సిరాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఆమె లాంటి సోదరి నాకెవరూ లేరు. ఆమె లేకుండా నేను ఎక్కడా ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లే.. ఆమె వెయ్యి మందిలో ఒకరు’ అనే కవిత్వాన్ని సిరాజ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్టు చేశాడు. మరోవైపు, జనై సైతం ఈ ఊహాగానాలపై స్పందించారు. సిరాజ్‌ తనకు ప్రియమైన సోదరుడని పేర్కొంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్టు పెట్టారు. ఇంతకీ జనై భోస్లే ఎవరో తెలుసా లెజండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు.

ఛాంపియన్స్ ట్రోఫీకి దక్కని చోటు

మ‌హ్మ‌ద్ సిరాజ్‌ను ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఎంపిక చేయ‌లేదు. పేస‌ర్ల విభాగంలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు బుమ్రా, ష‌మీల‌కు సెల‌క్ట‌ర్లు చోటు ఇచ్చారు. సిరాజ్‌ను ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఎంపిక చేయ‌క‌పోవ‌డం అంద‌రిని షాక్‌కు గురి చేసింది. ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టీ20, వ‌న్డే సిరీసుల్లోనూ అత‌డికి చోటు ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం త‌న‌కు దొరికిన విరామాన్ని సిరాజ్ ఎంజాయ్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. కాగా.. ఇటీవ‌లే తెలంగాణ ప్ర‌భుత్వం సిరాజ్ ను డీఎస్పీగా నియ‌మించింది.

Tags

Next Story