T20 WORLD CUP: టీమిండియా "వైభవో"పేతం

T20 WORLD CUP: టీమిండియా వైభవోపేతం
X
భారత క్రి­కె­ట్ భవి­ష్య­త్తుకు పూర్తి భరోసా

భారత క్రి­కె­ట్ భవి­ష్య­త్తు మరో­సా­రి తన సత్తా­ను ప్ర­పం­చా­ని­కి చా­టిం­ది. ప్ర­తి­భ­కు వయ­సు­తో సం­బం­ధం లే­ద­ని, సం­క­ల్పా­ని­కి హద్దు­లు ఉం­డ­వ­ని ని­రూ­పి­స్తూ భారత అం­డ­ర్‌–19 జట్టు మరో చరి­త్రా­త్మక వి­జ­యా­న్ని తన ఖా­తా­లో వే­సు­కుం­ది. ఒత్తి­డి క్ష­ణా­ల్లో­నూ ఆత్మ­వి­శ్వా­సం కో­ల్పో­కుం­డా, జట్టు ఆటతో ముం­దు­కు సా­గిన యువ భా­ర­త్… ఆరో­సా­రి అం­డ­ర్‌–19 ప్ర­పం­చ­క­ప్‌­ను కై­వ­సం చే­సు­కు­ని దే­శా­న్ని గర్వం­తో నిం­పిం­ది. ఇది కే­వ­లం ఒక ట్రో­ఫీ కాదు… భారత క్రి­కె­ట్‌­కు కొ­న­సా­గు­తు­న్న విజయ పరం­ప­ర­కు మరో బల­మైన ము­ద్ర. ఫై­న­ల్ పో­రు­లో ఇం­గ్లం­డ్‌­పై భా­ర­త్ ఘన వి­జ­యం సా­ధిం­చిం­ది. ఈ మ్యా­చ్‌­లో యువ ఆట­గా­డు వై­భ­వ్ సూ­ర్య­వం­శీ వీర వి­హా­రం చే­శా­డు. కే­వ­లం 80 బం­తు­ల్లో­నే 175 పరు­గు­లు చేసి మ్యా­చ్‌ గమ­నా­న్ని పూ­ర్తి­గా భా­ర­త్ వైపు తి­ప్పా­డు. అతని బ్యా­టిం­గ్‌­లో ధై­ర్యం, టె­క్ని­క్‌, దూ­కు­డు అన్నీ అద్భు­తం­గా కని­పిం­చా­యి. ఈ ఇన్నిం­గ్స్‌ అభి­మా­ను­ల­కు చి­ర­స్మ­ర­ణీ­యం­గా ని­లి­చిం­ది.

ఆయుష్ మత్రే నాయకత్వంలో భారత యువజట్టు అద్భుతంగా రాణించింది. వరుసగా ఆరోసారి ఫైనల్ చేరడమే కాకుండా, టైటిల్‌ను కూడా గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు భారత్ 2000, 2008, 2012, 2018, 2022 సంవత్సరాల్లో టైటిల్ గెలవగా… ఇప్పుడు ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఇదే ఇం­గ్లం­డ్‌­పై భా­ర­త్‌­కు మరో ప్ర­త్యేక వి­జ­యం. 2022లో ఇం­గ్లం­డ్‌­ను ఓడిం­చి కప్‌ సా­ధిం­చిన యువ భా­ర­త్, ఇప్పు­డు మళ్లీ అదే జట్టు­పై వి­జ­యం సా­ధిం­చి తన ఆధి­ప­త్యా­న్ని చా­టిం­ది. ఇక ఇం­గ్లం­డ్‌­కు ఇది మూడో ఫై­న­ల్ ఓటమి. మొ­త్తం­గా ఇప్ప­టి­వ­ర­కు జరి­గిన 15 అం­డ­ర్‌–19 ప్ర­పం­చ­క­ప్‌­ల­లో భా­ర­త్ తొ­మ్మి­ది సా­ర్లు ఫై­న­ల్‌­కు చే­ర­గా, ఆరు­సా­ర్లు వి­జే­త­గా ని­లి­చిం­ది. గతం­లో మహ్మ­ద్ కైఫ్, వి­రా­ట్ కో­హ్లీ, ఉన్ము­క్త్ చంద్, పృ­థ్వీ షా, యష్ ధుల్ నా­య­క­త్వం­లో ట్రో­ఫీ­లు అం­దు­కు­న్న భా­ర­త్… ఇప్పు­డు ఆయు­ష్ మత్రే సా­ర­థ్యం­లో మరో­సా­రి కప్‌­ను అం­దు­కుం­ది.

ఈ విజయం యువతకు స్ఫూర్తి. భారత క్రికెట్‌కు భవిష్యత్తు ఎంత భద్రమో చెప్పే గొప్ప సంకేతం.

Tags

Next Story