CT2025: కొదమ సింహాల మధ్య యుద్ధం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. హైబ్రిడ్ మోడల్ లో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా వన్డే ఫార్మాట్ లో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 అగ్రశ్రేణి జట్లు తలపడనున్నాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. టీమిండియా సహా జట్లు అన్నీ బలంగానే కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా, పాక్, ఇంగ్లండ్, ఆఫ్గాన్ జట్లు బలంగా ఉండడంతో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ దే: క్లార్క్
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ విరుచుకుపడడం ఖాయమని.. కంగారు జట్ట మాజీ ఆటగాడు మైకేల్ క్లార్ల్ అంచనా వేశాడు. భీకర ఫామ్ లో ఉన్న హెడ్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలుస్తాడని అంచనా వేశాడు. ఆస్ట్రేలియా జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ట్రోఫీ సాధించవచ్చని తెలిపాడు. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత జట్టు దక్కించుకోవడం ఖాయమని మైకెల్ క్లార్క్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
బౌలింగ్ భారమంతా షమీపైనే
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి మ్యాచుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఈనెల 20న బంగ్లాదేశ్ తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి రేసు గుర్రం బుమ్రా దూరం కావడం... టీమిండియాను కలవరపెడుతోంది. బుమ్రా దూరం కావడంతో భారత జట్టు బౌలింగ్ భారమంతా షమీ పైనే పడింది. బుమ్రా స్థానాన్ని షమీ భర్తీ చేస్తాడని.. అందులో అనుమానం వద్దని మాజీ పేసర్ బాలాజీ వెల్లడించాడు.
కొహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్‌గా బరిలో దిగుతున్న పరుగుల యంత్రం విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. CTలో విరాట్ మరో 263 రన్స్ చేస్తే.. టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం క్రిస్ గేల్ 791 రన్స్‌తో ముందున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 529 పరుగులు చేశాడు. భారత్ తన తొలి మ్యాచ్ FEB 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com