CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం

దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య మార్చిన 9వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమిండియా విజయం సాధించాలంటే కొన్ని విషయాల్లో మెరుగవ్వాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదని, నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని చెప్పాడు. ఓపెనింగ్ జోడీ పరుగులు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. బౌలింగ్‌లో కొత్త బంతితో ఆరంభంలోనే వికెట్లు తీయాలని... అప్పుడే ఫైనల్లో విజయం సులువవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫైనల్ మ్యాచ్‌కు పిచ్ సిద్ధం
భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు పిచ్ సిద్ధమైంది. గ్రూప్ దశలో భారత్ - పాకిస్థాన్ ఆడిన పిచ్‌నే క్యూరేటర్లు తుది సమరానికి సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ మ్యాచ్‌లో పాక్ 244 పరుగులు చేయగా భారత్ విజయం సాధించింది. ఇది వరకు భారత్ మ్యాచులన్నీ కొత్త పిచ్‌లపైనే ఆడగా ఫైనల్ దీనిపై ఆడనుంది. అయితే దుబాయ్‌లో ఆడటం ఇండియాకు కలిసి వస్తోందని విమర్శలు ఉన్నాయి.
ఫైనల్ అంపైర్లు వీరే..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్ అంపైర్లను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అంపైర్లు పాల్ రీఫెల్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ మైదానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. జోయెల్ విల్సన్ టీవీ అంపైర్‌గా, కుమార్ ధర్మసేన నాల్గవ అంపైర్‌గా, రంజన్ మదుగలే మ్యాచ్ రిఫరీగా ఉంటారు. వీరు అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న అంపైర్లు కావడం గమనార్హం.
రోహిత్‌కు BCCI స్పెషల్ గిఫ్ట్!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిస్తే రోహిత్ శర్మకు బీసీసీఐ ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆ బహుమతి రోహిత్ కెప్టెన్సీ గురించని టాక్. అతడి కెప్టెన్సీని మరో రెండేళ్ల పాటు పొడిగించొచ్చు అని క్రికెట్ వర్గాలు తెలిపాయి. 2027 ప్రపంచ కప్ వరకు కొనసాగిస్తుందని సమాచారం. అయితే దీనిపై హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ.. మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.
శ్రేయస్‌కు ప్రమోషన్!
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముంగిట టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ ప్రమోషన్ దక్కింది. అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్దరించేందుకు BCCI సిద్దమైనట్లు తెలుస్తోంది. గతంలో బీసీసీఐ ఆదేశాలను పాటించలేదని శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇషాన్ కిషన్‌ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను రద్దు చేసిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com