MARY KOM: ‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ ఆరోపణల్లోనిజం లేదని ఆమె మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్ అన్నారు. ‘ఆమెకు జూనియర్ బాక్సర్తో వివాహేతర సంబంధం ఉండేది. ఫ్యామిలీ సర్దిచెప్పినా మళ్లీ మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. అందుకు నా దగ్గర వాట్సాప్ మెసేజ్ ప్రూఫ్‌లు కూడా ఉన్నాయి. ఒంటరిగా ఉంటూ అక్రమ సంబంధాలు నడిపించాలనుకుంది. అందుకే విడాకులు తీసుకుంది’ అని ఓ మీడియా సంస్థతో పేర్కొన్నారు. మేరీ కోమ్ ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె విడాకులు తీసుకోవడంపై అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ క్రమంలో మేరీ కోమ్ స్పందిస్తూ.. తన విడాకులపై సంచలన విషయాలను బయటపెట్టారు. తన భర్త ఆన్లర్ (ఓంకోలర్) తనను ఆర్థికంగా దారుణంగా మోసం చేశారని, తన కష్టార్జితంతో కొన్న ఆస్తులను ఆమెకు తెలియకుండా తన పేరు మీదకు మార్చుకున్నారని మేరీ కోమ్ ఆరోపించారు. ఆస్తులను తనఖా పెట్టి ఆన్లర్ భారీగా అప్పులు చేశారని, దీనివల్ల తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 2022 కామన్వెల్త్ గేమ్స్ సమయంలో గాయపడి మంచానికే పరిమితమైనప్పుడు, తన ఆర్థిక వ్యవహారాల గురించి ఆరా తీయగా ఈ చేదు నిజాలు వెలుగులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. తన వ్యక్తిగత విషయాలు రచ్చకెక్కకూడదని ఇంతకాలం మౌనంగా ఉండటానికి కారణమని చెప్పుకొచ్చారు.కానీ సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వం పై తప్పుడు ప్రచారాలు జరుగుతుండటంతో ఇప్పుడు నిజం చెప్పక తప్పలేదని మేరీ కోమ్ స్పష్టం చేశారు. ఈ ఆరోపణలను ఆమె భర్త తాజాగా కొట్టిపడేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

