Ambati Rayudu : రాయుడు రిటైర్మెంట్ తీసుకోవడం లేదు : చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ

Ambati Rayudu : చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే కాసేపటికే ఆ ట్వీట్ డిలీట్ చేశాడు.. ప్రస్తుతం తాను ఆడుతున్న సీజన్ చివరి ఐపీఎల్ అని తెలిపాడు.
"ఇది నా చివరి ఐపిఎల్ అని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. నేను 13 సంవత్సరాలుగా 2 గొప్ప జట్లలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను.. నా ప్రయాణం అద్భుతంగా సాగేలా చేసిన ముంబై ఇండియన్స్, చెన్నై జట్లకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు" అని తెలిపాడు.. అయితే ట్వీట్ చేసిన పదిహేను నిమిషాయలకే రాయుడు దానిని మళ్లీ డిలీట్ చేశాడు.
రాయుడు రిటైర్మెంట్ ట్వీట్ పైన చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందించారు. రాయుడు రిటైర్మెంట్ తీసుకోవడం లేదని, రాయుడుతో తాను మాట్లాడినట్టుగా వెల్లడించారు ఈ సీజన్ లో ఫామ్ లో లేకపోవడం వలన అతను ఆ నిర్ణయం వైపు వెళ్ళు ఉండొచ్చు. ఏది ఏమైనా రాయుడు మాతో ఉంటాడు.. IPL 2023లో రాయుడు చెన్నై జట్టు తరుపున ఆడుతాడని విశ్వనాథన్ తెలిపారు.
36 ఏళ్ల అంబటి రాయుడు.. ఐపీఎల్ 2020 సీజన్‌లో 12 మ్యాచ్‌లాడి 27.10 సగటుతో 271 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com