AMITH MISHRA: నచ్చిన వారికే జట్టులో చోటు

AMITH MISHRA: నచ్చిన వారికే జట్టులో చోటు
X
జట్టులో చోటుపై అమిత్ మిశ్రా సంచలన ఆరోపణలు.... పలు అనుభవాలు పంచుకున్న దిగ్గజ స్పిన్నర్ మిశ్రా... కెప్టెన్‌కు నచ్చకపోవడం నో ఛాన్స్‌: స్పిన్నర్

టీ­మిం­డి­యా మాజీ క్రి­కె­ట­ర్‌ అమి­త్‌ మి­శ్రా కీలక వ్యా­ఖ్య­లు చే­శా­డు. తాను జా­తీయ జట్టు­కు ఆడే సమ­యం­లో సె­ల­క్ష­న్‌ వి­ధా­నం వే­రు­గా ఉం­డే­ద­ని పే­ర్కొ­న్నా­డు. కె­ప్టె­న్ల­కు నచ్చి­తే అవ­కా­శా­లు వస్తూ­నే ఉం­టా­య­ని.. లే­దం­టే ఇలా వచ్చి అలా వె­ళ్లి­పో­వా­ల్సి ఉం­టుం­ద­ని నర్మ­గ­ర్భ వ్యా­ఖ్య­లు చే­శా­డు. కాగా భారత మాజీ స్పి­న్న­ర్‌ అమి­త్‌ మి­శ్రా క్రి­కె­ట్‌ నుం­చి పూ­ర్తి­గా తప్పు­కొ­న్న­ట్లు ప్ర­క­టిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే. అన్ని స్థా­యి­ల్లో­నూ ఆట నుం­చి రి­టై­ర్‌ అవు­తు­న్న­ట్లు అతడు తె­లి­పా­డు. కాగా 43 ఏళ్ల మి­శ్రా తొ­లి­సా­రి 2003లో భారత జట్టు­కు వన్డే­ల్లో ప్రా­తి­ని­ధ్యం వహిం­చా­డు.

సంచలన ఆరోపణలు చేసిన మిశ్రా

తన మన­సు­లో­ని భా­వా­ల­ను అమి­త్ మి­శ్రా ని­స్సం­దే­హం­గా బయ­ట­పె­ట్టా­డు. కె­రీ­ర్‌­లో ఎదు­రైన పలు అను­భ­వా­ల­ను వె­ల్ల­డిం­చా­డు. చి­వ­రి­సా­రి­గా 2017లో అం­త­ర్జా­తీయ మ్యా­చ్‌ ఆడిన అమి­త్‌ మి­శ్రా.. ఆ తర్వాత కే­వ­లం ఐపీ­ఎ­ల్‌­కే పరి­మి­త­మ­య్యా­డు. ఇక ఈ మెగా లీ­గ్‌­లో­నూ 2024లోనే చి­వ­రి మ్యా­చ్‌ ఆడా­డు. మూ­డు­సా­ర్లు హ్యా­ట్రి­క్‌ వి­కె­ట్లు తీ­సిన ఏకైక బౌ­ల­ర్‌­గా ఇప్ప­టి­కీ అతడి పే­రి­టే రి­కా­ర్డు ఉంది. కానీ, జా­తీయ జట్టు­లో మా­త్రం ఎక్కు­వ­గా అవ­కా­శా­లు దక్కిం­చు­కో­లే­క­పో­యా­డు. దా­ని­కి కా­ర­ణం తాను ‘కె­ప్టె­న్‌’కు ఇష్ట­మైన ప్లే­య­ర్‌ కా­క­పో­వ­డ­మే­న­ని మి­శ్రా వ్యా­ఖ్యా­నిం­చా­డు. ‘నా జీ­వి­తం­లో అన్ని రకా­లు­గా భా­గ­మైన క్రి­కె­ట్‌­కు 25 ఏళ్ల తర్వాత గు­డ్‌­బై చె­బు­తు­న్నా. నా కె­రీ­ర్‌­లో ఎన్నో వి­జ­యా­లు, మలు­పు­లు, భా­వో­ద్వే­గా­లు ఉన్నా­యి. నా కె­రీ­ర్‌­లో అం­డ­గా ని­లి­చిన అం­ద­రి­కీ కృ­త­జ్ఞ­త­లు. మరో రూ­పం­లో ఆటతో నా అను­బం­ధం కొ­న­సా­గు­తుం­ది’ అని అమి­త్‌ మి­శ్రా సో­ష­ల్‌ మీ­డి­యా­లో పో­స్ట్‌ చే­శా­డు. తనకు టీ­మిం­డి­యా­లో అవ­కా­శా­లు తక్కు­వ­గా రా­వ­డం పట్ల స్పం­దిం­చా­డు. ‘‘ని­జం­గా ఓ ఆట­గా­డి­ని అన్నిం­టి­కం­టే ని­రా­శ­ప­రి­చే వి­ష­యం ఇదే. కొ­న్ని­సా­ర్లు జట్టు­లో ఉం­టా­ము.. మరి­కొ­న్ని సా­ర్లు మన­ల్ని ఎం­పిక చే­య­రు. మరి­కొ­న్ని­సా­ర్లు జట్టు­లో ఉన్నా.. ప్లే­యిం­గ్‌ ఎలె­వ­న్‌­లో చోటు ఉం­డ­దు. ఇలాం­టి­వి తరచూ జరు­గు­తూ ఉంటే వి­సు­గు వస్తుం­ది. నా వి­ష­యం­లో చా­లా­సా­ర్లు ఇలా­గే జరి­గిం­ది. కొంత మంది ఆట­గా­ళ్లం­టే కె­ప్టె­న్ల­కు ఇష్టం. కా­బ­ట్టి వా­రి­కి వరుస అవ­కా­శా­లు వస్తూ ఉం­టా­యి. అయి­నా.. అదో పె­ద్ద వి­ష­యం కాదు. ఏదే­మై­నా మన­ల్ని మనం ని­రూ­పిం­చు­కుం­టే అవ­కా­శం అదే తలు­పు తడు­తుం­ది.” అని మి­శ్రా అన్నా­డు.

హ్యాట్రిక్ మధుర జ్ఞాపకం

తొలి ఐపీ­ఎ­ల్ సీ­జ­న్‌­లో­నే హ్యా­ట్రి­క్‌ తీ­సిన అమి­త్ మి­శ్రా.. సం­చ­లన ప్ర­ద­ర్శ­న­తో ఆక­ట్టు­కు­న్నా­డు. షా­హి­ద్ అఫ్రి­ది, గి­బ్స్‌ వంటి డేం­జ­ర­స్‌ బ్యా­ట­ర్ల­ను పె­వి­లి­య­న్‌­కు చే­ర్చా­డు. ‘‘నాకు జీ­వి­తాం­తం గు­ర్తుం­డి­పో­యే క్ష­ణా­లం­టే ఐపీ­ఎ­ల్‌ 2008 సీ­జ­న్‌­లో హ్యా­ట్రి­క్. డె­క్క­న్‌ ఛా­ర్జ­ర్స్‌­పై ది­ల్లీ డే­ర్‌­డె­వి­ల్స్‌ తర­ఫున నేను ఐదు వి­కె­ట్ల ప్ర­ద­ర్శన చేశా. ఆ తర్వాత మళ్లీ జా­తీయ జట్టు­లో­కి పు­న­రా­గ­మ­నం అయ్యిం­ది. దా­ని­కి ముం­దే దే­శ­వా­ళీ­లో ని­ల­క­డ­గా బౌ­లిం­గ్‌ చేశా. కానీ, టీ­మ్‌­ఇం­డి­యా­లో మళ్లీ ఛా­న్స్‌­రా­లే­దు. ఎప్పు­డై­తే ఐపీ­ఎ­ల్‌­లో హ్యా­ట్రి­క్‌­తో మె­రి­శా­నో.. మళ్లీ పి­లు­పు వచ్చిం­ది.’’ అని అమి­త్ గు­ర్తు చే­సు­కు­న్నా­డు. అమి­త్ మి­శ్రా 2003లో అరం­గే­ట్రం చే­య­గా.. సౌ­ర­భ్‌ గం­గూ­లీ, రా­హు­ల్ ద్ర­వి­డ్, ధోనీ, వి­రా­ట్ కో­హ్లీ సా­ర­థ్యం­లో ఆడా­డు. 2003లో ఢా­కా­లో సౌ­తా­ఫ్రి­కా­తో మ్యా­చ్‌­లో మి­శ్రా వన్డే­ల్లో అరం­గే­ట్రం చే­శా­డు. 2008లో ఆస్ట్రే­లి­యా­తో ఆడిన తన తొలి టె­స్టు తొలి ఇన్నిం­గ్స్‌­లో ఐదు వి­కె­ట్ల­తో సత్తా­చా­టా­డు. భా­ర­త్‌ తర­ఫున 22 టె­స్ట్‌­లు, 36 వన్డే­లు, 10 టీ20లలో ప్రా­తి­ని­థ్యం వహిం­చా­డు.

Tags

Next Story