Anand Mahindra: శెభాష్ మహీంద్రా జీ.. మాటనిలబెట్టుకున్నారుగా..

Anand Mahindra: మహీంద్రా అంటేనే మాట నిలబెట్టుకునే మనిషి. టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. స్ఫూర్తినిచ్చే వ్యక్తులను పరిచయం చేస్తుంటారు.. వారికి తగిన ప్రోత్సాహం ఇచ్చి ముందుకు వెళ్లడంలో సాయపడుతుంటారు. తాజాగా పారా ఒలింపిక్స్ విజేత అవని లేఖరాకు బహుమతి ఇచ్చారు.
ఆమెకోసం స్పెషల్‌గా డిజైన్ చేయించిన వాహనాన్ని అవనికి అందించారు. 2020 ఆగస్టులో జరిగిన పారా ఒలింపిక్స్‌లో అవని లేఖరా 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించింది. అంతేకాదు 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో రజత పతకం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అవనిని ప్రశంసిస్తూ ఆనంద్ ఆమెకు సులభంగా ప్రయాణించేందుకు వీలుగా కొత్త మహీంద్రా వాహనాన్ని తయారు చేయించి బహుమతిగా ఇస్తానని ప్రకటించారు.
ఆనంద్ మహీంద్రా చెప్పిన వెంటనే మహీంద్రా గ్రూప్ చీఫ్ డిజైనర్ ప్రతాప్ బోస్ ఆధ్వర్యంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఓఓ మోడల్‌లో మార్పులు చేశారు. డ్రైవర్ సీటు పక్కన ఉండే కో డ్రైవర్ సీటు బయటకి వచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ మార్పు వల్ల దివ్యాంగులు సులభంగా కారులోకి ఎక్కడం, దిగడం చేయవచ్చు.
దివ్యాంగులకు ఉండే ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయించిన కారును అవని లేఖరకు అందించారు మహీంద్రా. తనకు బహుమతిగా వచ్చిన కారుని చూసి మురిసిపోయింది లేఖర. థ్యాంక్యూ ఆనంద్ జీ అంటూ తాను కారులో కూర్చున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
🙏🏽🙏🏽🙏🏽 https://t.co/WgHyREpiYo
— anand mahindra (@anandmahindra) January 19, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com