Wimbledon: 3వ రౌండ్‌ ఫలితాలు ఇవే, ఆండీ ముర్రే ఇంటికి

Wimbledon: 3వ రౌండ్‌ ఫలితాలు ఇవే, ఆండీ ముర్రే ఇంటికి

వింబుల్డన్‌లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే మూడో రౌండ్‌లో ఇంటి ముఖం పట్టాడు. మరోవైపు వరల్డ్ నంబర్ 1 ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ మూడో రౌండ్‌లో నెగ్గి తదుపరి రౌండ్‌కి దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్‌లో బ్రిటన్ క్రీడాకారిణి కేటీ బౌల్టర్ కూడా ఇంటి ముఖం పట్టడంతో బ్రిటన్ ఆశలు గల్లంతయ్యాయి.

పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో బ్రిటన్‌ ప్లేయర్ ముర్రే, గ్రీస్ క్రీడాకారుడు సిట్సిపాస్ చేతిలో 7-6 (3), 6-7 (2), 4-6, 7-6 (3), 6-4 తేడాతో ఓడాడు. 5 సెట్లలో హోరాహోరీగా మ్యాచ్ సాగింది. మొదటి సెట్‌ని 7-6తో కోల్పోయిన ముర్రే తర్వాత పుంజుకుని ఆడటంతో 2, 3 సెట్లను ఖాతాలో వేసుకుని సిట్సిపాస్‌ని ఒత్తిడిలోకి నెట్టాడు. కీలకమైన నాలుగో సెట్‌లో అద్భుతంగా ఆడిన సిట్సిపాస్ టై బ్రేకర్‌ పాయింట్‌తో సెట్ సొంతం చేసుకుని మ్యాచ్‌ని రసవత్తరంగా మార్చాడు. చివరి సెట్‌ని 6-4తో గెలిచి మ్యాచ్‌ ముర్రేని వింబుల్డన్‌ నుంచి బయటకు పంపాడు. 4వ రౌండ్‌లో లాస్లో జెరీతో తలపడనున్నాడు.


ఇక వరల్డ్ నంబర్ 1 ఆటగాడు అల్కరాజ్ మూడో రౌండ్‌లో నికోలస్ జార్రీని తేడాతో ఓడించాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్‌కి విజయం సునాయసంగా ఏమీ రాలేదు. మెదటి సెట్‌ని గెలిచిన అల్కరాజ్‌, రెండో సెట్‌లో నికోలస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. సెట్‌ని టై బ్రేకర్‌కి తీసుకెళ్లి గెలిచాడు. మూడో సెట్‌లో అద్భుతంగా ఆడిన నికోలస్ 4-1 ఆధిక్యం సాధించి, వరల్డ్ నంబర్‌కి గట్టి పోటీనిచ్చాడు. అయితే అల్కారాజ్ తన అనుభవం, నైపుణ్యంతో తర్వాతి 7 గేమ్స్‌లో 6 గేమ్స్‌ గెలిచి సెట్‌ని, మ్యాచ్‌ని సొంతం చేసుకున్నాడు. 4వ రౌండ్‌లో ఇటలీ ఆటగాడు మాట్టే బెర్రెట్టెతో తలపడనున్నాడు.

సెర్బియన్ స్టార్ ఆటగాడు జకోవిచ్, మూడో రౌండ్‌లో స్టాన్ వావ్రింకాపై 6-3 6-1 7-6(5) తేడాతో గెలిచి ఇప్పటికే 4వ రౌండ్‌కి చేరుకున్నాడు.

మహిళల సింగిల్స్‌లో బ్రిటన్ క్రీడాకారిణి కేటీ బౌల్టర్, కజకిస్థాన్ ప్లేయర్, డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ 3వ ర్యాంకర్ ఎలెనా రెబకినా చేతిలో ఓడింది. 56 నిమిషాలు మాత్రమే సాగిన మ్యాచ్‌లో 6-1, 6-1 తేడాతో బౌల్టర్‌ని చిత్తు చేసింది. దీంతో సింగిల్స్ పోటీల్లో బ్రిటన్ వింబుల్డన్ నుంచి నిష్క్రమించింది.

Tags

Read MoreRead Less
Next Story