Wimbledon: ముందంజలో ఆండీ ముర్రే, మధ్యలోనే ఆగిన మ్యాచ్

Wimbledon: ముందంజలో ఆండీ ముర్రే, మధ్యలోనే ఆగిన మ్యాచ్
* తిరిగి ఈ రోజు ఆరంభమవనున్న ఆట * ఆండీ ముర్రే విజయం సాధిస్తే మేజర్ గ్రాండ్ స్లామ్‌ల్లో 200వ విజయం అతడి సొంతమవుతుంది.

వింబుల్డన్‌ టోర్నీలో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే తన ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. గురువారం జరిగిన 2వ రౌండ్‌లో వరల్డ్ నంబర్ 5 ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్‌పై 6-7(3), 7-6(2), 6-4 తేడాతో ముందంజలో ఉన్నాడు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.30 సమయంలో కర్ఫ్యూ కారణంగా ఆటని మధ్యలోనే ఆపేశారు. మిగిలిన ఆట శుక్రవారం తిరిగి ప్రారంభమవనుంది.

మ్యాచ్ ఇద్దరూ తమ షాట్లు, ప్రతిభతో ఆసక్తికరంగా మార్చారు. మొదటి రౌండ్‌లో స్కోర్లు సమం కావడంతో టై బ్రేక్‌లో సిట్సిపాస్ పాయింట్ సాధించి సెట్ సొంతం చేసుకున్నాడు. మొదటి సెట్‌లో ఓడినప్పటికీ ముర్రే అద్భుతంగా పుంజుకుని రెండవ సెట్‌ని దక్కించుకున్నాడు. ఈ మాజీ నంబర్ 1 ప్లేయర్ క్రమంగా తన దూకుడైన ఆట, గ్రౌండ్ స్ట్రోక్‌లతో రెండవ సెట్‌ని గెలుచుకున్నాడు.

మూడవ సెట్‌ సర్వ్ చేసేటప్పుడు జారిపడ్డాడు. కాసేపయ్యాక కుదురుకుని సెట్‌లో మళ్లీ ఆధిక్యంలో దూసుకెళ్లి విజయం వైపు వెళ్తున్నాడు. 10.30 సమయంలో అధికారులు మ్యాచ్‌ని ఆపేసి, తిరిగి శుక్రవారం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఈ మ్యాచ్‌లో ఆండీ ముర్రే విజయం సాధిస్తే మేజర్ గ్రాండ్ స్లామ్‌ల్లో 200వ విజయం అతడి సొంతమవుతుంది.

మరోవైపు మొదటి రౌండ్‌లో 5 సెట్లలో డొమినిక్ థీమ్‌ని ఓడించిన సిట్సిపాస్ కూడా 3వ రౌండ్‌కి వెళ్లలాన్న పట్టుదలతో ఆడుతున్నాడు. వింబుల్డన్‌లో సిట్సిపాస్ అత్యుత్తమంగా 2018 సంవత్సరంలో 4వ రౌండ్‌ వరకు మాత్రమే వెళ్లగలిగాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారు తదుపరి రౌండ్‌లో లాస్లో జేనితో తలపడనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story