TIMED OUT: క్రికెట్ చరిత్రలో తొలిసారి

అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి ఓ క్రికెటర్ టైమ్‌డ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి ఈ వింత ఘటన జరిగింది. శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటించడంతో.. అతడు ఒక్క బంతి ఆడకుండానే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంతవరకూ ఏ ఒక్క బ్యాటర్ కూడా ఈ విధంగా ఔట్ అవ్వలేదు. తొలిసారిగా శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఏంజెలో మ్యాథ్యూస్ టైమ్డ్ అవుటయ్యాడు. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. మాధ్యూస్‌ను టైమ్డ్ అవుట్ అంటూ అప్పీల్ చేశాడు.
42 బంతుల్లో 41 పరుగులు చేసిన సదీర సమరవిక్రమను షకీబ్ అవుట్ చేసిన తర్వాత మాథ్యూస్ బ్యాటింగ్‌కి వచ్చాడు. మైదానంలోకి అడుగుపెట్టే సమయంలో మాథ్యూస్ హెల్మెట్ స్ట్రాప్ విరిగిపోయింది. అతడు కొత్త హెల్మెట్ కోసం డ్రెస్సింగ్ రూం వైపు సిగ్నల్ ఇచ్చాడు. అలా అతడు క్రీజులోకి రావడం ఆలస్యమైంది. ఈ క్రమంలోనే బంగ్లా జట్టు ‘టైమ్‌డ్ ఔట్’ కోసం అప్పీల్ చేసింది. ఆ అప్పీల్‌ను పరిశీలించిన అంపైర్.. మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాడు. హెల్మెట్ బాగా లేని కారణంగా ఆలస్యమైందని మాథ్యూస్ వాదించినప్పటికీ.. అంపైర్లు ఔట్ ఇచ్చేశారు. దీంతో క్రీజులోకి రాకముందే అతడు ఔటై పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.
వికెట్ పడిన తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ 2 నిమిషాల్లోపు తదుపరి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. లేకపోతే అతను టైమ్డ్ అవుట్ అవుతాడు. ఏంజెలో మాథ్యూస్ బ్యాటింగ్ చేయడానికి ఆలస్యంగా వచ్చాడని షకీబ్ అప్పీల్ చేశాడు. దాంతో అంపైర్లు సమయం సరిచూసి అవుట్‌గా ప్రకటించారు. దీంతో మాథ్యూస్ బంతి ఎదుర్కోకుండానే నిష్క్రమించాల్సి వచ్చింది. అసలంకా ప్రస్తుతం ధనంజయ డి సిల్వాతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇలా ఓ క్రికెటర్ ‘టైమ్‌డ్ ఔట్’తో వెనుదిరగడం ప్రపంచకప్‌లోనే కాదు అంతర్జాతీయ క్రికెట్‌లోనే తొలిసారి కావడం గమనార్హం. అంతకుముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆరుగురు ఆటగాళ్లు ఇలా టైమ్‌డ్ ఔట్ అయ్యారు. అందులో భారత్‌కు చెందిన హేములాల్ యాదవ్ కూడా ఉన్నాడు. క్రీజులో ఉన్న బ్యాటర్ ఔట్ అయితే తర్వాతి బ్యాటర్ నిర్ణీత సమయంలోగా బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ సమయం 3 నిమిషాలుగా ఉండగా.. 2023 వన్డే ప్రపంచకప్ నిబంధనల్లో ఆ గడువు 120 సెకన్లుగా మార్చారు. అంటే, 2 నిమిషాల్లో తర్వాతి బ్యాటర్ క్రీజులోకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ, ఆ గడువు లోగా బ్యాటర్ రాకపోతే.. దాన్ని టైమ్‌డ్ ఔట్‌గా పేర్కొంటూ.. ఆ క్రికెటర్‌ను ఔట్‌గా ప్రకటిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com