Ujjain: ఉజ్జయినీ మహంకాళేశ్వరుడిని దర్శించుకున్న కోహ్లీ దంపతులు..

Ujjain: ఆస్ట్రేలియాతో భారత్ 4వ టెస్టు మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఇండోర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3వ టెస్ట్ ముగిసిన తర్వాత, ఆలయానికి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఇద్దరూ తమ కుమార్తె వామికతో కలిసి రిషికేశ్, బృందావన్‌ని సందర్శించారు. బృందావన్‌లో బాబా నీమ్ కరోలి ఆశ్రమాన్ని, రిషికేశ్‌లో స్వామి దయానంద్ జీ మహారాజ్ సమాధిని సందర్శించారు. ఇండోర్‌లో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఆస్ట్రేలియన్లు జూన్‌లో లండన్‌లోని ఓవల్‌లో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించారు. ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్‌లో చోటు దక్కించుకోవాలంటే భారత్‌కి ఇప్పుడు చివరి టెస్టుల్లో విజయం అవసరం. ముఖ్యంగా నాలుగో, చివరి టెస్టు మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com