SANJU SAMSHAN: సంజు శాంసన్‌కు మూసుకుపోయిన దారులు..!

SANJU SAMSHAN: సంజు శాంసన్‌కు మూసుకుపోయిన దారులు..!
X
వరుసగా విఫలమవుతున్న సంజు... 9 మ్యాచుల్లో వరుసగా సంజు విఫలం... 9 మ్యాచుల్లో 104 రన్స్ చేసిన సంజు.. సంజు స్థానంలో ఇషాన్ ప్లేస్ ఫిక్స్

టీ20 వర­ల్డ్‌­క­ప్ 2026 కోసం బీ­సీ­సీఐ ఇప్ప­టి­కే భారత జట్టు­ను ప్ర­క­టిం­చిం­ది. జట్టు­లో మా­ర్పు­లు చే­సు­కు­నేం­దు­కు జన­వ­రి 31 వరకు అవ­కా­శం ఉంది. ఈ నే­ప­థ్యం­లో భారత సె­లె­క్ట­ర్ల ముం­దు ఓ కీలక ప్ర­శ్న ని­లి­చిం­ది. అదే.. అభి­షే­క్ శర్మ­తో కలి­సి ఇన్నిం­గ్స్‌­ను ఆరం­భిం­చే­ది ఎవరు?. సంజు శాం­స­న్‌?, ఇషా­న్ కి­ష­న్?, శు­భ్‌­మ­న్ గిల్?.. ఈ ము­గ్గు­రి­లో ఓపె­న­ర్‌­గా ఎవరు ఆడు­తా­రు?. ప్ర­స్తుత ఫామ్ చూ­స్తే.. ఓపె­న­ర్‌­గా ఇషా­న్ ఆడే అవ­కా­శా­లే ఎక్కు­వ­గా ఉన్నా­యి. గిల్ ఇప్పు­డు జట్టు­లో లే­కు­న్నా.. సంజు వరుస వై­ఫ­ల్యా­లు అత­డి­కి చోటు దక్కే­లా చే­స్తా­య­న­డం­లో ఎలాం­టి అతి­శ­యో­క్తి లేదు.న్యూ­జి­లాం­డ్‌­తో ఐదు మ్యా­చ్‌ల సి­రీ­స్‌­ను భా­ర­త్ 3-0తో కై­వ­సం చే­సు­కు­న్నా.. ఆ మూడు వి­జ­యా­ల్లో సంజు శాం­స­న్‌ పా­త్ర ఏమీ లేదు. మూడు టీ20ల్లో వరు­స­గా 10, 6, 0 పరు­గు­ల­తో ని­రాశ పరి­చా­డు. గు­వా­హ­టి­లో తొలి బం­తి­కే ఆఫ్‌­స్టం­ప్ ఎగి­రి­పో­యిం­ది. బ్యా­క్ ఫుట్ నుం­చి ఫ్లి­క్ చే­య­బో­యి పూ­ర్తి­గా మిస్ అయ్యా­డు. గా­య­ప­డిన తె­లు­గు ఆట­గా­డు తి­ల­క్ వర్మ స్థా­నం­లో తుది జట్టు­లో­కి వచ్చిన ఇషా­న్ కి­ష­న్ రె­చ్చి­పో­యా­డు. వరు­స­గా 8, 76, 28 పరు­గు­ల­తో సత్తా­చా­టా­డు. దాం­తో టీ20 వర­ల్డ్‌­క­ప్ 2026 ముం­దు సంజు ఫామ్ బీ­సీ­సీఐ సె­లె­క్ష­న్ చర్చ­ల్లో ప్ర­ధాన అం­శం­గా మా­రిం­ది. న్యూ­జి­లాం­డ్, భా­ర­త్ మధ్య జరు­గు­తు­న్న ఐదు టీ20ల సి­రీ­స్ లో చె­త్త ప్ర­ద­ర్శన కన­బ­రి­చా­డు సంజు శాం­స­న్. ఒక్క మ్యా­చ్ లో కూడా సరి­గ్గా ప్ర­ద­ర్శన కన­బ­ర­చ­లే­దు. అట్ట­ర్ ఫ్లా­ప్ అయ్యా­డు. అం­తే­కా­దు 2025 జూన్ మాసం నుం­చి ఇప్ప­టి వరకు 9 ఇన్నిం­గ్స్ లలో సంజు చే­సిం­ది 104 పరు­గు­లు మా­త్ర­మే. స్ట్రై­ట్ రేట్ 133 కాగా, యా­వ­రే­జ్ 11 మా­త్ర­మే ఉంది. ఇం­దు­లో హై­యె­స్ట్ స్కో­ర్ కే­వ­లం 37 పరు­గు­లు మా­త్ర­మే.

సంజు స్థానంలో ఇషాన్ కిషన్?

వరు­స­గా 9 ఇన్నిం­గ్స్ లలో అట్ట­ర్ ఫ్లా­ప్ అయిన సంజు శాం­స­న్ స్థా­నం­లో డేం­జ­ర్ ఆట­గా­డు ఇషా­న్ కి­ష­న్ కు ఛా­న్స్ ఇవ్వా­ల­ని డి­మాం­డ్ చే­స్తు­న్నా­రు ఫ్యా­న్. ఎలా­గూ టీ20 జట్టు­లో­కి తి­ల­క్ వర్మ త్వ­ర­లో రా­బో­తు­న్నా­డు. అతని మూడవ స్థా­నం­లో ఆడిం­చి, ఇశా­న్ కి­ష­న్ కు ఓపె­న­‌­ర్ గా అవ­కా­శం ఇవ్వా­ల­ని కో­రు­తు­న్నా­రు. సంజు శాం­స­న్ ను తుది జట్టు నుం­చి తొ­ల­గిం­చా­ల­ని డి­మాం­డ్ చే­స్తు­న్నా­రు. సంజూ స్థా­నం­లో ఇశా­న్ కి­ష­న్ ఓపె­న­ర్ గా అలా­గే కీ­ప­ర్ గా కూడా పని­కి వస్తా­డ­ని సూ­చ­న­లు చే­స్తు­న్నా­రు. మరి దీ­ని­పై బీ­సీ­సీఐ ఎలా ముం­దు­కు వె­ళ్తుం­దో చూ­డా­లి.

తి­ల­క్ వర్మ ఫి­ట్‌­నె­స్‌ సా­ధిం­చా­డు కా­బ­ట్టి మూడో స్థా­నం­లో ఆడ­ను­న్నా­డు. ఈ నే­ప­థ్యం­లో ఫామ్ లే­మి­తో సత­మ­తం అవు­తు­న్న సంజు శాం­స­న్‌­ను ప్లే­యిం­గ్ 11లో ఉం­చ­డం కష్ట­మే. అప్పు­డు ఇషా­న్ కి­ష­న్ జట్టు­లో ఉం­డ­డం ఖాయం. అభి­షే­క్ శర్మ­తో కలి­సి ఇషా­న్ ఓపె­నిం­గ్ చే­స్తా­డు. ఇషా­న్ వి­కె­ట్ కీ­ప­ర్ కూడా కా­వ­డం అత­డి­కి కలి­సొ­చ్చే అంశం. సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ తి­రి­గి ఫా­మ్‌­కు వచ్చా­డు. కె­ప్టె­న్‌­గా, బ్యా­ట్స్‌­మ­న్‌­గా నా­లు­గో స్థా­నం­లో ఆడు­తా­డు. ఆపై హా­ర్ది­క్ పాం­డ్యా, రిం­కు సిం­గ్, శి­వ­మ్ దూ­బే­లు ఆడు­తా­రు. ఫామ్ పరం­గా చూ­సు­కుం­టే.. శు­భ్‌­మ­న్ గిల్ జట్టు­లో చోటు దక్కిం­చు­కో­వ­డం కష్ట­మే. సంజు జట్టు­లో ఉన్నా.. ఇషా­న్ ఓపె­నిం­గ్ చే­య­డం ఖా­యం­గా కని­పి­స్తోం­ది. ఎటు చూ­సు­కు­న్నా.. న్యూ­జి­లాం­డ్‌ టీ20 సి­రీ­స్‌ సం­జు­కు ని­రాశ కలి­గిం­చిం­ది. అం­తే­కా­దు ఇక సంజు పని అయి­పో­యి­న­ట్లే అని కూడా ఫా­న్స్ అం­టు­న్నా­రు. చూ­డా­లి మరి సంజు పరి­స్థి­తి ఎలా ఉం­డ­నుం­దో.

Tags

Next Story