Barcelona vs Arsenal: బార్సిలోనాపై ఆర్సెనల్ ఘన విజయం

Barcelona vs Arsenal: స్పెయిన్ లాలిగా విజేత ఎఫ్‌సీ బార్సీలోనాను, ఇంగ్లాండ్ క్లబ్ ఆర్సెనల్ జట్టు 5-3 గోల్స్ తేడాతో చిత్తుచేసింది. గత సీజన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను తృటిలో చేజార్చుకున్న ఆర్సెనల్ ప్రీ సీజన్‌ని ఘనంగా ఆరంభించింది. బార్సిలోనా స్టార్ లెవన్‌డోస్కీ మొదటి గోల్ చేసి బార్సిలోనాను ఆధిక్యంలో నిలిపినా, ఆర్సెనల్ జట్టు తేరుకుని విజయంతో ముగించింది.
లాస్ ఏంజెల్స్‌లోని సోఫీ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో బార్సిలోనా ఘనంగా ఆరంభించింది. 7వ నిమిషంలోనే లెవన్‌డోస్కీ గోల్ చేశాడు. 13వ నిమిషంలో గోల్ కొట్టి ఆర్సెనల్ 1-1తో సమం చేసింది. తర్వాతి నిమిషంలోనే గోల్ చేసే బంగారు అవకాశం వచ్చినా ఆర్సెనల్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 21వ నిమిషంలో బార్సిలోనా ఆటగాడు ఆర్సెనల్ ఆటగాడు కొట్టిన షాట్ బార్సిలోనా ఆటగాడి చేతికి తాకడంతో పెనాల్టీ లభించింది. ఈ అవకాశాన్ని కూడా ఆర్సెనల్ వృథా చేసుకుంది. పెనాల్టీ టేకర్ సాలా బంతిని గోల్ పోస్ట్‌కి దూరంగా కొట్టడంతో గోల్ అవకాశం కోల్పోయారు.
34వ నిమిషంలో బార్సీలోనాకి లభించిన ఫ్రీకిక్ అవకాశాన్ని ఉపయోగించుకున్న రఫీనా అద్భుతమైన షాట్‌తో గోల్ పోస్ట్‌లోకి బంతిని పంపాడు. 43వ నిమిషంలో ఆర్సెనల్ ఆటగాడ్ హెడర్‌తో గోల్‌గా మలవడంతో మొదటి అర్ధ భాగానికి స్కోర్ 2-2గా సమమైంది.
రెండవ అర్ధభాగంలో ఇరుజట్లు కూడా గోల్ పోస్టులపై దాడులతో హోరాహోరీగా ఆడారు. 55వ నిమిషంలో బార్సిలోనా డిఫెన్స్‌ని ఛేదిస్తూ ఆర్సెనల్ ప్లేయర్ గోల్ కొట్టడంతో 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 78వ నిమిషంలో ట్రొస్పార్డ్ మళ్లీ మెరవడంతో ఆర్సెనల్ మరో గోల్ చేసింది. బార్సిలోనా దూకుడుగా ఆడుతూ 88వ నిమిషంలో గోల్ సాధిందించింది. నిమిషం గడవక ముందే ఆర్సెనల్ ఆటగాడు ఫాబియో వీరా గోల్ కొట్టడంతో ఆర్సెనల్ విజయం ఖరారైంది.
ఆర్సెనల్ vs బార్సిలోనా
బుకాయో సాకా 13' - రాబర్ట్ లెవండోస్కీ 7
కై హావర్ట్జ్ 43 -రఫీనా 34
లియండ్రో ట్రోస్సార్డ్ 55, 78 -ఫెరాన్ టోర్రేస్ 88
ఫాబియో వీరా 89
Tags
- Arsenal Beat FC Barcelona
- 5-3 Goals
- FC Barcelona
- Laliga
- Premier League
- Barcelona
- Lewandoski
- Raphina
- Frendlies
- pre Season
- arsenal
- arsenal goals
- arsenal fc
- arsenal football club
- arsenal highlights
- goals
- arsenal classics
- barcelona
- arsenal barcelona
- fc barcelona
- arsenal vs
- arsenal training
- arsenal vs liverpool
- liverpool vs arsenal
- chelsea arsenal
- arsenal v chelsea
- arsenal 5-2
- arsenal undefeated
- arsenal spurs
- lauren arsenal
- van persie goals
- arsenal c
- arshavin arsenal
- arsenal 49
- van persie arsenal
- van persie leaving arsenal
- arsenal 3-0 man city
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com