ASHES: ఐదో టెస్టులో ఆస్ట్రేలియా విజయం

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. స్వదేశంలో జరిగిన 2025-2026 ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉస్మాన్ ఖవాజాకు సిరీస్ విజయంతో ఘనమైన వీడ్కోలు పలికింది. కాగా, రోండో ఇన్నింగ్స్‌లో 302/8తో ఐదో రోజు అటను కొనసాగించిన ఇంగ్లాండ్ 342 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్(29), జాక్ వెదర్లాండ్(34) శుభారంభాన్నిచ్చారు. తదతనంతరం వచ్చిన బ్యాటర్లు లబుషేన్(37) మినహా ఎవరు రాణించలేదు. కెప్టెన్ స్టీవ్ స్మిత్(12), కెరీర్లోనే చివరి మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖవాజా(6) నిరాశపరిచారు. అలెక్స్ కేరీ(16), కామెరూన్ గ్రీన్(22) నాటౌట్‌గా నిలిచి విజయాన్ని అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్(3/42) రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్384, ఆసీస్ 567 రన్స్‌కు అలౌటయ్యాయి. 302/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 88.2 ఓవర్లలో 342 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్, సెంచరీ హీరో జాకోబ్ బెతెల్( 265 బంతుల్లో 15 ఫోర్లతో 154)ను మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు అతను 12 పరుగులు మాత్రమే చేశాడు.
ఓవర్‌నైట్ స్కోర్‌కు అతను 12 పరుగులు మాత్రమే చేశాడు. జోష్ టంగ్(6) సాయంతో మాథ్యూ పోట్స్(18 నాటౌట్) కాసేపు పోరాడినా.. మిచెల్ స్టార్క్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. జోష్ టంగ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/72), బ్యూ వెబ్‌స్టార్(3/64)మూడేసి వికెట్లు తీయగా.. మైఖేల్ నేసర్ ఒక వికెట్ పడగొట్టాడు. స్కాట్ బోలాండ్ రెండు వికెట్లు తీసాడు.
సునాయాస విజయం
183 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో 160 పరుగుల లక్ష్యాన్ని ఎదుర్కొన్న ఆస్ట్రేలియా, వన్డే తరహా బ్యాటింగ్‌తో 31.2 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్ (29), జాక్ వెదరాల్డ్ (34), మార్నస్ లబుషేన్ (37) రాణించగా, ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ (3/42) మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 97.3 ఓవర్లలో 384 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (160) సెంచరీతో మెరిసినా, ఆసీస్ బౌలర్లలో మైఖేల్ నేసర్ (4/60), మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ కీలకంగా వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 567 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (138) సెంచరీలతో చెలరేగగా, బ్యూ వెబ్‌స్టర్ (71 నాటౌట్) సహకరించాడు. సిరీస్‌లో 26 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలవగా, ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

