ASHES: ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ ఘన విజయం

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో తలపడ్డాయి. ఇప్పటికే మూడు టెస్టుల్లో ఓడి.. సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ ఈ బాక్సింగ్ డే టెస్టులో 4 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డ మీద దాదాపు 15 ఏళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లండ్ ఈ విజయం సాధించడం గమనార్హం. 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో క్రాలీ(37), బెన్ డకెట్(34) జట్టుకు శుభారంభాన్ని అందించారు. జాకబ్ బెథెల్(40) రాణించాడు. బ్రైడన్ కార్స్(6), జో రూట్(15), బెన్ స్టోక్స్(2) బ్యాటింగ్‌లో మరోసారి విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్(2*), జెమీ స్మిత్(3*) నాటౌట్‌గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్, రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
175 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు గెలుపొందింది. జాకోబ్ బెతెల్(46 బంతుల్లో 5 ఫోర్లతో 40), బెన్ డకెట్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 34), జాక్ క్రాలీ(48 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, జై రిచర్డ్‌సన్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు తీసారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 34.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(67 బంతుల్లో 4 ఫోర్లతో 46), స్టీవ్ స్మిత్(24 నాటౌట్), కామెరూన్ గ్రీన్(19) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు బ్యాటర్లు డకౌటయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

