ASHWIN: ఇక నా దృష్టంతా క్రికెట్‌పైనే: అశ్విన్

ఐపీఎల్ 2025లో డెవాల్డ్ బ్రెవిస్‌ను సీఎస్కే తీసుకోవడంపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇతర ఫ్రాంఛైజీలు పోటీపడినా.. సీఎస్కే ఎక్కువ మొత్తం ఆఫర్ చేసి అతడిని దక్కించుకుందని అశ్విన్ ఇటీవల అన్నాడు. అయితే దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ స్పందించింది. తాము నిబంధనలు పాటించే అతడిని తీసుకున్నామని, ఇందులో ఎలాంటి తప్పూ జరగలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి స్పందించాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందులో క్రీడా విషయాలపై అతడు డిబేట్లు పెడుతుంటాడు. ఇటీవల డివాల్డ్ బ్రెవిస్ గురించి మాట్లాడాడు. చెన్నై సూపర్ కింగ్స్ గాయపడ్డ గుర్జప్నీత్ సింగ్ ప్లేసులో డెవాల్డ్ బ్రెవిస్‌ను తీసుకుంది. అయితే ఇతర జట్లు పోటీ పడ్డప్పటికీ ధర చూసి వెనక్కి తగ్గాయని, సీఎస్కే పట్టుబట్టి మరీ దక్కించుకుందని అశ్విన్ అన్నాడు. దీంతో బ్రెవిస్‌ను దక్కించుకునేందుకు సీఎస్కే అక్రమాలకు పాల్పడిందనే ప్రచారం జరిగింది.
అసలు అశ్విన్ ఏమన్నాడంటే?
తన యూట్యూబ్ ఛానల్లో చాలా విషయాలపై అశ్విన్ డిబేట్లు పెడుతుంటాడు. ఇలాగే సీఎస్కే గత ఐపీఎల్ సమయంలో తీసుకున్న ఓ నిర్ణయంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా ఆటగాడు బ్రెవిస్ బేస్ ప్రైస్ రూ. 75 లక్షలు. కానీ, అతడిని రిప్లేస్‌మెంట్‌గా రూ.2.2 కోట్లు చెల్లించి చెన్నై తీసుకుంది. గుర్జప్నీత్ సింగ్ గాయం కారణంగా ఆ ఎడిషన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలోనే బ్రెవిస్‌కు అవకాశం లభించింది. ఇతర జట్లు కూడా పోటీ పడినా.. అతడి ధర చూసి వెనక్కి తగ్గాయని, సీఎస్కే మాత్రం పట్టుబట్టి తీసుకుందని అశ్విన్ వ్యాఖ్యానించాడు. అతడు చేసిన వ్యాఖ్యలను బట్టి సీఎస్కే బ్రెవిస్‌ను అక్రమంగా తీసుకుందనే ఆరోపణలు వినిపించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్ కౌన్సిల్ నుంచి అప్రూవల్ రాలేదనే విమర్శలూ వస్తున్నాయి.
సీఎస్కే దిద్దిన స్టార్...
చెన్నై సూపర్ కింగ్స్ అతి పెద్ద మ్యాచ్ విన్నర్లలో ఒకడిగా అశ్విన్ గుర్తింపు పొందాడు. తొలిసారి అతను 2009లో సీఎస్కే టీమ్ ద్వారానే లీగ్‌లో అడుగు పెట్టాడు. రెండు సీజన్లు నిలకడైన ప్రదర్శన, ధోని అండతో అతనికి భారత జట్టులో స్థానం దక్కింది. 2010, 2011లో సీఎస్కే టైటిల్స్ సాధించడంలో అతను కీలకపాత్ర పోషించాడు. వరుసగా ఏడేళ్ల పాటు 2015 వరకు చెన్నైకి ఆడిన అనంతరం ఆ తర్వాత ఎనిమిది సీజన్లు వరుసగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లకు అశ్విన్ ప్రాతినిధ్యం వహించాడు. 2025 వేలంలో రూ.9 కోట్ల 75 లక్షల మొత్తానికి చెన్నై అతడిని మళ్లీ సొంతం చేసుకుంది. సూపర్ కింగ్స్ తరఫున 106 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 6.68 ఎకానమీతో 97 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో అతను 221 మ్యాచ్‌లలో 7.20 ఎకానమీతో 187 వికెట్లు పడగొట్టాడు. 39 ఏళ్ల అశ్విన్ గత డిసెంబర్లో ఆ్రస్టేలియాపై అడిలైడ్‌తో టెస్టు మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అశ్విన్ వ్యాఖ్యలతో ఈ వివాదానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com