ASHWIN:ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన బౌలింగ్ సైంటిస్ట్‌

ASHWIN:ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన బౌలింగ్ సైంటిస్ట్‌
X
స్టార్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక నిర్ణయం.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు కీలక ప్రకటన... పలు ఫ్రాంచైజీల తరఫున అశ్విన్ ఉత్తమ ప్రతిభ.. \221 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 187 వికెట్లు తీసిన అశ్విన్

భా­ర­త్‌ స్టా­ర్‌ బౌ­ల­ర్‌ రవి­చం­ద్ర­న్‌ అశ్వి­న్‌ కీలక ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. ఐపీ­ఎ­ల్‌­కు గు­డ్‌­బై చె­ప్తు­న్న­ట్లు ప్ర­క­టిం­చా­రు. చి­వ­రి­గా అశ్వి­న్‌ చె­న్నై సూ­ప­ర్‌ కిం­గ్స్‌ తర­ఫున ఐపీ­ఎ­ల్‌ టో­ర్నీ ఆడా­డు. ఐపీ­ఎ­ల్‌­లో పలు ఫ్రాం­చై­జీల తర­ఫున కూడా అశ్వి­న్ ఉత్తమ ప్ర­తిభ కన­బ­రి­చా­రు. 221 ఐపీ­ఎ­ల్‌ మ్యా­చ్‌­లు ఆడిన అశ్వి­న్‌ 187 వి­కె­ట్లు తీ­శా­డు. ఆయన చె­న్నై, పం­జా­బ్‌, ది­ల్లీ, రా­జ­స్థా­న్‌, పుణె జట్ల­కు ప్రా­తి­ని­ధ్యం వహిం­చా­డు.ఇప్ప­టి­కే అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌­కు వీ­డ్కో­లు పలి­కిన అశ్వి­న్‌, తా­జా­గా ఐపీ­ఎ­ల్‌ నుం­చి కూడా తప్పు­కో­వ­డం­తో.. అతని ఫ్యా­న్స్ ఆవే­దన వ్య­క్తం చే­స్తు­న్నా­రు.

భావోద్వేగ పోస్ట్‌

అశ్వి­న్ తన ని­ర్ణ­యా­న్ని సో­ష­ల్ మీ­డి­యా వే­దిక X లో వె­ల్ల­డిం­చా­రు. “ఒక ప్ర­త్యే­క­మైన రోజు, అం­దు­కే కొ­త్త ఆరం­భం. నా ఐపీ­ఎ­ల్ ప్ర­యా­ణం ఇక్క­డి­తో ము­గు­స్తోం­ది. కానీ, ఇప్పు­డు ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా వి­విధ లీ­గ్‌­ల్లో ఆడేం­దు­కు నా కొ­త్త అధ్యా­యం మొ­ద­ల­వు­తోం­ది” అని ఆయన తె­లి­పా­రు. అశ్వి­న్ తన 16 సీ­జ­న్ల ఐపీ­ఎ­ల్‌ కె­రీ­ర్‌­లో మొ­త్తం 221 మ్యా­చ్‌­లు ఆడా­రు. ఇం­దు­లో 187 వి­కె­ట్లు తీ­శా­రు. ఆయన బౌ­లిం­గ్ సగటు 30.22 కాగా, ఎకా­న­మీ రేట్ 7.20, స్ట్రై­క్ రేట్ 25.2. ఉత్తమ బౌ­లిం­గ్ ఫి­గ­ర్స్ 4/34 వి­కె­ట్లు. బ్యా­ట్స్‌­మ­న్‌­గా కూడా అశ్వి­న్ రా­ణిం­చా­రు. 92 ఇన్నిం­గ్స్‌­ల్లో 833 పరు­గు­లు సా­ధిం­చా­రు. 118.15 స్ట్రై­క్ రేట్, 13.01 సగ­టు­తో తన బ్యా­టిం­గ్ కొ­న­సా­గిం­చా­రు. ఐపీ­ఎ­ల్ లో అశ్వి­న్ అత్య­ధిక వ్య­క్తి­గత స్కో­రు 50 పరు­గు­లు. చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ తర­ఫున అశ్వి­న్ ఎన్నో మధుర క్ష­ణా­ల­ను అం­దిం­చా­రు. 2010, 2011లో ఐపీ­ఎ­ల్ టై­టి­ల్ గె­లు­పు­లో కీలక పా­త్ర పో­షిం­చా­రు. 2010లో ఛాం­పి­య­న్స్ లీగ్ టి20లో ప్లే­య­ర్ ఆఫ్ ది సి­రీ­స్‌­గా ని­లి­చా­రు. 2011 ఐపీ­ఎ­ల్ ఫై­న­ల్లో మొ­ద­టి ఓవర్ వేసి, క్రి­స్ గే­ల్‌­ను డక్‌ అవు­ట్ చేసి జట్టు­ను వి­జ­యం వైపు నడి­పిం­చా­రు. 2014లో మరో­సా­రి ఛాం­పి­య­న్స్ లీగ్ టై­టి­ల్ గె­లి­చా­రు. 2025లో చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ టీమ్ అశ్వి­న్ ను రూ. 9.75 కో­ట్లు వె­చ్చిం­చి తి­రి­గి జట్టు­లో­కి తీ­సు­కుం­ది.

అశ్విన్‌ది మాస్టర్ మైండ్

38 ఏళ్ల అశ్వి­న్ పదే­ళ్ల వి­రా­మం తర్వాత 2025లో చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ జట్టు­లో చే­రా­డు. ఎన్నో అం­చ­నా­ల­తో మెగా ఆక్ష­న్ లోకి అడు­గు­పె­ట్టిన అశ్వి­న్ ను చె­న్నై రూ. 9.75 కో­ట్ల భారీ ధరకు కొ­ను­గో­లు చే­సిం­ది. లో­క­ల్ ప్లే­య­ర్ కా­వ­డం­తో ఈ వె­ట­ర­న్ స్పి­న్న­ర్ పై సీ­ఎ­స్కె యా­జ­మా­న్యం ఎన్నో అం­చ­నా­లు పె­ట్టు­కుం­ది. అయి­తే ఐపీ­ఎ­ల్ 2025లో అశ్వి­న్ ఘో­రం­గా వి­ఫ­ల­మ­య్యా­డు. తొ­మ్మి­ది మ్యా­చ్‌­ల్లో మా­త్ర­మే ఆడి 9.13 ఎకా­న­మీ రే­టు­తో ఏడు వి­కె­ట్లు మా­త్ర­మే తీ­సు­కు­న్నా­డు. బ్యా­టిం­గ్‌­లో­నూ రా­ణిం­చిం­ది లేదు. ఐపీ­ఎ­ల్ 2026 సీ­జ­న్ లో అశ్వి­న్ ను రి­లీ­జ్ చే­య­డం ఖా­య­మ­నే హిం­ట్స్ చె­న్నై జట్టు నుం­చి అం­దా­యి. 2009 నుం­డి 2015 వరకు ఆరు సీ­జ­న్లు సీ­ఎ­స్కె జట్టు తర­పున ఆడా­డు. 2016 నుం­చి 2024 మధ్య ఢి­ల్లీ క్యా­పి­ట­ల్స్, పం­జా­బ్ కిం­గ్స్, రా­జ­స్థా­న్ రా­య­ల్స్‌ ఫ్రాం­చై­జీ­ల­కు ప్రా­తి­ని­ధ్యం వహిం­చా­డు.

Tags

Next Story