ASIA CUP: ఆసియా కప్ భారత జట్టు ఇదే

ఆసియా కప్(Asia Cup 2023) వన్డే టోర్నీలో పోటీపడే జట్టేదో తేలిపోయింది. జట్టులో ఎవరెవరికి చోటు దక్కనుందన్న ఉత్కంఠకు తెరదించుతూ అజిత్ అగార్కర్ సారథ్యంలో(chief selector Ajit Agarkar )ని సెలక్షన్ కమిటీ 17 మంది ఆటగాళ్ల(17-member travelling squad )తో కూడిన జట్టు(Team India Squad )ను ప్రకటించింది. శ్రేయస్, కేఎల్ రాహుల్(Shreyas Iyer-KL Rahul )కు ఆసియా కప్ జట్టులో స్థానం కల్పించింది. హైదరాబాదీ తిలక్ వర్మ( Tilak Varma) తొలిసారి భారత వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ 20ల్లో విధ్వంసం సృష్టించిన తిలక్ ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకుని.. వన్డే ప్రపంచకప్‌లో స్థానం దిశగా పెద్ద ముందడుగు వేశాడు. ఆసియాకప్‌లో సత్తా చాటి వన్డే ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కావాలని ఆటగాళ్లు యువ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.
రోహిత్ సారథ్యంలో(captain Rohit Sharma)ని జట్టులో గాయాల నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. సంజూ శాంసన్ బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, కేఎల్ రాహుల్ కూడా సిద్ధంగానే ఉన్నాడని కానీ కాస్త ఇబ్బంది పడుతున్నాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఆసియాకప్ ప్రారంభం వరకు అతడు కూడా అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నామని, ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతోనే రాహుల్‌కు బ్యాకప్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేశామని తెలిపాడు.
భారత జట్టుకు శిఖర్ ధవన్ ఎంతో చేశాడని, కానీ ప్రస్తుతం రోహిత్, శుభ్‌మన్ గిల్‌లను ఓపెనర్లుగా చూస్తున్నామని సెలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఇషాన్ కిషన్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేశామని, కాంబినేషన్ సమస్య వల్లే చాహల్‌ను తీసుకోలేకపోయామని వెల్లడించింది. ఎనిమిదో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగల వాళ్ల కోసం చూస్తున్నామని, దీని వల్లే అక్షర్ ఎంపిక సులువైందని, అతడితో పాటు కుల్దీప్ స్పిన్ బాధ్యతలు చూసుకుంటారని అగార్కర్ తెలిపాడు. ఆసియాకప్ కోసం భారీ జట్టును ప్రకటించే వీలు ఉండటంతోనే.. కోచ్, కెప్టెన్‌కు అదనపు వెసులుబాట్లు కల్పించాలనే ఉద్దేశంతో 17 మందిని ఎంపిక చేశాం. వన్డే ప్రపంచకప్ విషయానికి వస్తే 15 మందినే ఎంపిక చేయాల్సి ఉంటుంది. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని స్పష్టం చేశాడు.
రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు యుజ్వేంద్ర చాహల్ గురించి సుదీర్ఘంగా చర్చించామని.. 17 మందినే ఎంపిక చేసే చాన్స్ ఉండటంతో వారికి టీమ్‌లో అవకాశం దక్కలేదని వెల్లడించారు. ఇంతటితో వన్డే వరల్డ్‌కప్‌నకు వారికి తలుపులు మూసుకున్నట్లు కాదని కూడా తేల్చి చెప్పారు.
ఈ నెల 30 నుంచి ఆసియాకప్ ప్రారంభం కానుంది. వన్డే ఫార్మాట్‌లో జరుగనున్న ఈ టోర్నీలో భారత్ ఆరు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 5 నుంచి సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో మెగాటోర్నీకి ఆసియాకప్‌ను రిహార్సల్‌గా భావిస్తున్నారు.
భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ (రాహుల్‌కు బ్యాకప్).
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com