ASIA CUP: నేటి నుంచే ఆసియా కప్

ఆసియా కప్ 2025 టోర్నీకి వేళైంది. మంగళవారం నుంచి ‘మినీ కప్’ సంబరం మొదలుకానుంది. 8 జట్లు 20 రోజుల పాటు అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ కాంటినెంటల్ టోర్నీలో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. యూఏఈ, హాంగ్ కాంగ్, ఒమన్ సంచలనాలు సృష్టించేందుకు సై అంటున్నాయి. తొలిసారి ఆసియా కప్ లో 8 జట్లు ఆడుతుండడంతో ఈ టోర్నీ ఆసక్తిగా మారింది. ఇప్పటికే ప్లేయర్లంతా సిద్ధం. ఎనిమిది జట్లు తలపడే ఈ టోర్నీలో ప్రతి క్రికెటరూ కీలకమే. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది.
అద్భుతాలు సాధ్యమే
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న రాత్రి 8 గంటలకు మొదలవుతుది. టోర్నమెంట్ దుబాయ్‌లో జరుగుతుంది. ఫైనల్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఆసియా కప్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు. ఆసియా దేశాల మధ్య ఒక ఉత్కంఠభరితమైన పోటీ అని చెప్పవచ్చు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్లు సర్ప్రైజ్లు ఇస్తుంటాయి. ఒమన్, యూఏఈ, హాంకాంగ్ లాంటి జట్లు ఈ సారి ఏదైనా అద్భుతం చేస్తాయేమో చూడాలి. . ఈసారి ఆసియా కప్‌ను టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేశారు. ఎందుకంటే 2025 అక్టోబర్‌లో భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించబోతున్నాయి. దీంతో అన్ని ఆసియా జట్లు తమ బలహీనతల్ని తెలుసుకునే మంచి ఛాన్స్‌గా ఈ టోర్నీని భావిస్తున్నాయి. ఈ సారి టోర్నమెంట్ మళ్లీ T20 ఫార్మాట్లో జరగనుంది. అది కూడా 2026లో భారత్, శ్రీలంకల్లో జరిగే ICC T20 వరల్డ్ కప్‌కి సన్నాహకంగా. గతంలో 2022లో శ్రీలంక ఆసియా కప్‌ని గెల్చుకుంది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ జట్టును ఓడించింది. 2023లో జరిగిన గత ఎడిషన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
గ్రూప్ దశ
ఈ దశలో ప్రతి గ్రూప్‌లోని జట్లు ఒకరినొకరు ఒక్కసారి తలపడతాయి. అంటే గ్రూప్ ఏలో భారత్ vs పాకిస్తాన్, భారత్ vs ఒమన్, భారత్ vs UAE ఇలా మ్యాచ్‌లు ఉంటాయి. అదే విధంగా గ్రూప్ బీలో కూడా. ఈ గ్రూప్ దశలో టాప్-2 జట్లు సూపర్ 4కి అర్హత సాధిస్తాయి. అంటే ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు ముందుకు వెళతాయి.
సూపర్ 4
సూపర్ 4లో గ్రూప్ A, గ్రూప్ B నుంచి వచ్చిన నాలుగు జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ఆడతాయి. అంటే ఈ నాలుగు జట్లూ ఒకరినొకరు ఒక్కసారి తలపడతాయి. ఈ దశలో టాప్-2 జట్లు ఫైనల్‌కి చేరుకుంటాయి. ఈ దశలో ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. ఎందుకంటే ఒక్క ఓటమి కూడా జట్టు ఫైనల్ రేస్ నుంచి బయటకి వెళ్లేలా చేస్తుంది.
ఫైనల్
సూపర్ 4 దశలో టాప్-2లో నిలిచిన జట్లు సెప్టెంబర్ 28, 2025న దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. 2022లో శ్రీలంక ఇక్కడే పాకిస్తాన్ జట్టును ఓడించి కప్ గెలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com