ASIA CUP: ఆసియా కప్..సమాధానం లేని ప్రశ్నలెన్నో.. ?

ASIA CUP: ఆసియా కప్..సమాధానం లేని ప్రశ్నలెన్నో.. ?
X
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్... భారత జట్టు ఎంపికపై విమర్శలు... పెదవి విరుస్తున్న మాజీ క్రికెటర్లు

వచ్చే నెల నుం­చి ప్రా­రం­భం కా­ను­న్న ఆసి­యా కప్‌­కు బీ­సీ­సీఐ.. చీఫ్ సె­ల­క్ట­ర్ అజి­త్ అగా­ర్క­ర్ నే­ప­థ్యం­లో టీం­ని ప్ర­క­టిం­చిం­ది. దీం­తో ఒక్క­టి కాదు రెం­డో కాదు అనేక గొ­డ­వ­లు తె­ర­పై­కి వచ్చా­యి. పా­క్‌­తో మ్యా­చు­లు వి­ష­యం ఒక­టై­తే, కొం­ద­రి ప్లే­య­ర్ల­ను ఎం­దు­కు సె­ల­క్ట్ చే­శా­రో మా­జీ­ల­కు అర్థం కా­వ­డం లేదట. అలా­గే మరి­కొం­ద­రి­కి ఎం­దు­కు అవ­కా­శం దక్క­లే­దో అంతు చి­క్క­డం­లే­దట.

రాణా ఎందుకు: చిక్కా

మాజీ క్రి­కె­ట­ర్‌ కృ­ష్ణ­మా­చా­రి శ్రీ­కాం­త్‌ టీ­మిం­డి­యా సె­ల­క్ష­న్‌­పై అసం­తృ­ప్తి వ్య­క్తం చే­శా­డు. బౌ­లిం­గ్‌­లో అద్భు­తం­గా రా­ణి­స్తు­న్న మహ్మ­ద్‌ సి­రా­జ్, ప్ర­సి­ద్ధ్‌ కృ­ష్ణ­ను కా­ద­ని హర్షి­త్‌ రా­ణా­ను ఎలా జట్టు­లో­కి తీ­సు­కుం­టా­ర­ని ప్ర­శ్నిం­చా­డు. ‘అసలు టీం­లో­కి హర్షి­త్‌ రాణా ఎక్కడ నుం­చి వచ్చా­డు. అతడి ప్ర­ద­ర్శన ఐపీ­ఎ­ల్‌­లో­నూ పే­ల­వం­గా ఉది. అతడి ఎకా­న­మీ 10గా ఉంది. అత­ణ్ని ఎం­పిక చేసి.. మహ్మ­ద్‌ సి­రా­జ్‌, ప్ర­సి­ద్ధ్‌ కృ­ష్ణ­కు ఏం సం­దే­శం ఇద్దా­మ­ను­కుం­టు­న్నా­రు?’ అని ఫైర్ అయ్యా­డు. " యశ­స్వి జై­స్వా­ల్‌ వంటి ప్లే­య­ర్ జట్టు­లో లే­క­పో­వ­డం నన్ను ఆశ్చ­ర్యా­ని­కి గు­రి­చే­సిం­ది. శు­భ్‌­మ­న్‌ గిల్ ఎం­పిక మంచి ని­ర్ణ­య­మే. అతడి ఆట బా­గుం­ది. భవి­ష్య­త్తు­లో మూడు ఫా­ర్మా­ట్ల­లో­నూ ఆడ­తా­డు. అయి­తే, జట్టు వి­జ­యం కోసం కీలక ఇన్నిం­గ్స్‌ ఆడే వా­రి­ని పక్కన పె­ట్ట­కూ­డ­దు. ఆసి­యా కప్‌ గె­ల­వ­గ­లి­గేంత అద్భు­త­మైన జట్టు మన­కుం­ది." అని మాజీ క్రి­కె­ట­ర్ మదన్ లా­ా­ల్ అన్నా­రు. భారత జట్టు ఎం­పి­క­లో సమ­తు­ల్యం లో­పిం­చి­న­ట్లు అని­పి­స్తోం­ద­ని పలు­వు­రు మా­జీ­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. దీ­ని­పై బీ­సీ­సీఐ అధి­కా­రి­కం­గా స్పం­దిం­చ­లే­దు.

జైస్వాల్‌‌కు ఏమైంది: అశ్విన్

బీ­సీ­సీఐ ప్ర­క­టిం­చిన టీం­లో అనూ­హ్యం­గా యశ­స్వి జై­స్వా­ల్‌­కు అవ­కా­శం దక్క­క­పో­వ­డం చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. గత టీ20 ప్ర­పం­చ­క­ప్‌­లో బ్యా­క­ప్ ఓపె­న­ర్‌­గా ఉన్న యశ­స్వి­కి ఇప్పు­డు ఆసి­యా కప్‌­లో చోటు కల్పిం­చ­క­పో­వ­డం సరి­కా­ద­ని అశ్వి­న్ వ్యా­ఖ్యా­నిం­చా­డు. అతడి స్ట్రై­క్‌­రే­ట్‌ కూడా చాలా బా­గుం­ద­ని గు­ర్తు­చే­శా­డు. ‘యశ­స్వి జై­స్వా­ల్‌­కు టె­స్టు అవ­కా­శం వచ్చి­న­ప్పు­డు స్వీ­క­రిం­చా­డు. ఈ మధ్య­కా­లం­లో టె­స్టు­ల్లో­కి అడు­గు­పె­ట్టిన అత్యంత వి­జ­య­వం­త­మైన క్రి­కె­ట­ర్ యశ­స్వి. ఏ ఫా­ర్మా­ట్‌­లో అయి­నా­స­రే ఎప్పు­డు అవ­కా­శం వచ్చి­నా వదు­లు­కో­లే­దు. అయి­నా సరే అత­డి­కి ఇప్పు­డు ఛా­న్స్‌ రా­లే­దు. ఒక దశలో నా­య­క­త్వం రే­సు­లో­నూ ని­లి­చిన ఆట­గా­డు ఏకం­గా జట్టు­లో­నే లే­క­పో­వ­డం షా­క్‌­కు గు­రి­చే­సిం­ది. ఈ ఫా­ర్మా­ట్‌­లో యశ­స్వి స్ట్రై­క్‌­రే­ట్ 165. చా­లా­సా­ర్లు తన కోసం కా­కుం­డా జట్టు కోసం ఆడే వా­రి­ని కను­క్కో­వ­డం చాలా కష్టం. అలాం­టి పరి­స్థి­తు­ల్లో యశ­స్వి జై­స్వా­ల్‌ ఉంటే సరి­గ్గా సరి­పో­తా­డు. ఆ జా­బి­తా­లో శ్రే­య­స్ అయ్య­ర్ కూడా ఉం­టా­డు’ అని అశ్వి­న్ వ్యా­ఖ్యా­నిం­చా­డు.

శ్రే­య­స్ అయ్య­ర్ పం­జా­బ్ కిం­గ్స్ కె­ప్టె­న్‌­గా, ప్లే­య­ర్‌­గా అద­ర­గొ­ట్టా­డు. మూడు లేదా నా­లు­గు స్థా­నా­ల్లో బ్యా­టిం­గ్ చే­శా­డు. 188.15 స్ట్రై­క్ రే­ట్‌­తో ఫా­స్ట్ బౌ­ల­ర్ల­ను ఎదు­ర్కొ­ని 397 పరు­గు­లు చే­శా­డు. స్పి­న్‌ మా­త్ర­మే బాగా ఆడ­తా­డ­నే­ది తప్ప­ని ప్రూ­వ్‌ చే­శా­డు. నరేం­ద్ర మోడీ స్టే­డి­యం­లో కగి­సో రబా­డా బౌ­లిం­గ్‌­లో కొ­ట్టిన భారీ సి­క్స్‌­తో షా­ర్ట్ బా­ల్స్‌ ఆడ­టం­లో ఉన్న వీ­క్నె­స్‌­ని అధి­గ­మిం­చి­న­ట్లు సి­గ్న­ల్‌ ఇచ్చా­డు. ఇం­త­గా పర్ఫా­ర్మ్‌ చే­సి­నా సరే సె­ప్టెం­బ­ర్ 2025లో UAE­లో జరి­గే ఆసి­యా కప్‌­కి అత­న్ని సె­ల­క్ట­ర్లు పట్టిం­చు­కో­లే­దు.

Tags

Next Story