ASIA CUP: హాంకాంగ్‌పై బంగ్లా విజయం

ASIA CUP: హాంకాంగ్‌పై బంగ్లా విజయం
X
రాణించిన కెప్టెన్ లిట్టన్ దాస్

ఆసి­యా కప్ 2025 టో­ర్నీ­లో బం­గ్లా­దే­శ్ శు­భా­రం­భం చే­సిం­ది. హాం­కాం­గ్‌­తో జరి­గిన మ్యా­చ్‌­లో సమ­ష్టి­గా రా­ణిం­చిన బం­గ్లా­దే­శ్ 8 వి­కె­ట్ల తే­డా­తో గె­లు­పొం­దిం­ది. కె­ప్టె­న్ లి­ట­న్ దాస్(39 బం­తు­ల్లో 6 ఫో­ర్లు, సి­క్స్‌­తో 59) హాఫ్ సెం­చ­రీ­తో బం­గ్లా­దే­శ్ వి­జ­యం­లో కీలక పా­త్ర పో­షిం­చా­డు. ఈ మ్యా­చ్‌­లో ముం­దు­గా బ్యా­టిం­గ్ చే­సిన హాం­కాం­గ్ ని­ర్ణీత 20 ఓవ­ర్ల­లో 7 వి­కె­ట్ల­కు 143 పరు­గు­లు చే­సిం­ది. కె­ప్టె­న్ యసి­మ్ ము­ర్తా­జా(19 బం­తు­ల్లో 2 ఫో­ర్లు, 2 సి­క్స్‌­ల­తో 28) మె­రు­గైన ప్ర­ద­ర్శన చే­శా­డు. ఓపె­న­ర్ జీ­ష­న్ అలీ(34 బం­తు­ల్లో 3 ఫో­ర్లు, సి­క్స్‌­తో 30), ని­జ­క­త్ ఖాన్(40 బం­తు­ల్లో 2 ఫో­ర్లు, సి­క్స్‌­తో 42) రా­ణిం­చా­రు. బం­గ్లా­దే­శ్ బౌ­ల­ర్ల­లో టస్కి­న్ అహ్మ­ద్, తం­జీ­మ్ హసన్ షకీ­బ్, రి­ష­ద్ హొ­స్సే­న్ రెం­డే­సి వి­కె­ట్లు తీ­సా­రు.

అనం­త­రం బం­గ్లా­దే­శ్ 17.4 ఓవ­ర్ల­లో 3 వి­కె­ట్ల­కు 144 పరు­గు­లు చేసి గె­లు­పొం­దిం­ది. లి­ట­న్‌­దా­స్‌­కు తో­డు­గా టౌ­హి­డ్ హృ­ద­య్(36 బం­తు­ల్లో ఫో­ర్‌­తో 35 నా­టౌ­ట్) రా­ణిం­చా­డు. హాం­గ్ కాం­గ్ బౌ­ల­ర్ల­లో అయు­ష్ శు­క్లా, అతీ­క్ ఇక్బా­ల్ చెరో వి­కె­ట్ తీ­సా­రు. లక్ష్య­చే­ధ­న­లో బం­గ్లా­దే­శ్ ఓపె­న­ర్లు పర్వే­జ్ హో­స్సే­న్(19), తం­జి­ద్ హసన్(14) త్వ­ర­గా­నే ఔటై­నా.. కె­ప్టె­న్ లి­ట­న్ దాస్, టౌ­హి­డ్ హృ­ద­య్ ఆచి­తూ­చి ఆడా­రు. 44 బం­తు­ల్లో లి­ట­న్ దాస్ హాఫ్ సెం­చ­రీ పూ­ర్తి చే­సు­కు­న్నా­డు. వరు­స­గా రెం­డు మ్యా­చ్‌­ల్లో ఓడిన హాం­కాం­గ్.. సూ­ప­ర్-4 రేసు నుం­చి తప్పు­కుం­ది.

Tags

Next Story