ASIA CUP: పాక్ ఆటగాళ్ల తిక్కకుదిరింది

ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్లేయర్లు హారిస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ కవ్వింపులకు పాల్పడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వికెట్లు తీసినప్పుడు రౌఫ్ భారత్‌కు చెందిన ఆరు జెట్ ఫ్లైట్స్‌ను కూల్చేశామంటూ ఆరు వేళ్లను చూపించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఫర్హాన్ భారత్ డ్రెస్సింగ్ రూం వైపు గన్ ఫైరింగ్ చేస్తున్నట్టు సంబరాలు చేసుకున్నాడు. వారు ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని భారత్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రౌఫ్, ఫర్హాన్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. శుక్రవారం వారిద్దరూ ఐసీసీ ఎదుట విచారణకు హాజరయ్యారు. తాము ఏం తప్పుచేయలేదంటూ వాదించినట్టు తెలుస్తోంది. 6-0 సంజ్ఞ భారత్‌కు సంబంధించింది కాదని రౌఫ్ చెప్పాడు. అలాగే, గన్ సెలబ్రేషన్ రాజకీయ ప్రేరేపితమైనవి కాదని ఫర్హాన్ వాదించాడు. తమ ప్రాంతంలో సంతోషకరమైన సందర్భాల్లో ఇలాంటి వేడుకలు సాధారణమంటూ తెలిపాడు. కానీ, ఐసీసీ వారి వాదనలతో సంతృప్తి చెందలేదు. వారిద్దరూ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్టు తేల్చింది. దీంతో రౌఫ్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది. ఫర్హాన్‌కు వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టింది. పాకిస్థాన్ ఆటగాళ్లు హారిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్‌లు ఆదివారం భారత్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో రెచ్చగొట్టే హావభావాలు ప్రదర్శించారు. విమానాలను కూల్చామంటూ.. రవూఫ్ మైదానంలో భారత అభిమానుల వైపు చూపిస్తూ ‘6-0’ సంకేతం చేశాడు. అయితే.. దీనిపై వివాదం తలెత్తడంతో.. ఆ సంకేతానికి ఎలాంటి అర్థం లేదని, దానిని తప్పుగా ఎలా పరిగణిస్తారని మ్యాచ్ రిఫరీతో అతడు అన్నట్లు సమాచారం.
కోహ్లీ పేరు చెప్పి...
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పేరు చెప్పి పాక్ ఆటగాళ్లు ఐసీసీ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఫర్హాన్ తన ‘గన్‌ఫైర్’ వేడుకల గురించి స్పందిస్తూ..‘నేను పఠాన్ని. మా దేశంలో ఇలాగే వేడుకలు చేసుకుంటాం’’ అని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విరాట్ కోహ్లీ కూడా ఇదే తరహాలో సెలబ్రేషన్స్ చేసుకుంటాడని.. అతడి పేరును ప్రస్తావించినట్లు సమాచారం. దీనికి ముందు, హారిస్ రౌఫ్, ఫర్హాన్ ఇద్దరు తాము నిర్దోషులమని ఐసీసీ ముందు చెప్పారు. ఫర్హాన్ తన గన్ షాట్ వేడుకలనున పాకిస్తాన్‌లోని తన జాతీ ఫఖ్తూన్ తెగ జరుపుకునే సాంప్రదాయ వేడుకలుగా పేర్కొన్నాడు. నివేదిక ప్రకారం, పాకిస్తాన్ జట్టు హోటల్లోనే విచారణ జరిగింది. ICC మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ శుక్రవారం పాక్ జట్టు హోటల్లో విచారణ జరిపారు. ఈ సమయంలో ఇద్దరు ఆటగాళ్లను పిలిచారు. ఇద్దరి సమాధానాలు కూడా ముందే లిఖితపూర్వకంగా తీసుకున్నారు. విచారణలో పాకిస్తాన్ జట్టు మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా కూడా పాల్గొన్నారు. "ICC మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ శుక్రవారం మధ్యాహ్నం టీమ్ హోటల్లో విచారణ పూర్తి చేశారు. దూకుడు ప్రవర్తనకు గాను హారిస్ రౌఫ్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించారు. అదే సమయంలో సాహిబ్జాదా ఫర్హాన్‌కు హెచ్చరిక చేసి వదిలేశారు" అని టోర్నమెంట్‌లోని ఒక అధికారి తెలిపారు. పాక్ ఆటగాళ్లపై చర్యలతో ఐసీసీ ఈ వివాదాన్ని ముగించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com