ASIA CUP: ఉత్కంఠభరిత పోరులో భారత్ "సూపర్" గెలుపు

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 202/5 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక (107) శతకం బాదాడు. కుశాల్ పెరీరా (58) రాణించాడు. భారత బౌలర్లలో హార్దిక్, వరుణ్, కుల్దీప్, అర్ష్‌దీప్, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తీశారు.
సూపర్ ఓవర్ ఇలా...
సూపర్ ఓవర్లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. భారత్ తరపున హర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ చేశాడు. హర్ష్ దీప్ తొలి బంతికే లంక బ్యాటర్ కుశాల్ పెరీరాను అవుట్ చేశాడు. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకముందే లంక తొలి వికెట్ కోల్పోయింది. అతర్వాత కూడా హర్ష్ దీప్ సింగ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు బంటి డాట్ అవ్వగా తర్వాత నాటకీయ పరిణామాలు జరిగాయి. హర్ష్ దీప్ బౌలింగ్ లో బాల్ కీపర్ చేతికి వెళ్లగా లంక బ్యాటర్లు పరుగుకు యత్నించారు. అయితే అప్పటికే సంజు శాంసన్ వికెట్లను గిరాటేశాడు. దానికి ముందే అంపైర్ అవుట్ ఇవ్వడంతో అది డెడ్ బాల్ అయింది. దీంతో లంక బ్యాటర్ బతికిపోయాడు. అయితే ఈఅవకాశాన్ని లంక బ్యాటర్ వినియోగించలేకపోయారు. తర్వాతి బంతికి హర్ష్ దీప్ మరో వికెట్ తీయడంతో లంక బ్యాటింగ్ ముగిసింది. లంక కేవలం రెండు పరుగులే చేయగలిగింది. అయితే సూర్య, గిల్ మూడు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగారు. ఆడిన తొలి బంతికే సూర్య మూడు పరుగులు సాధించడంతో భారత్ విజయం సాధించింది.
దంచికొట్టిన అభిషేక్
ఈ మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లా.. భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి శ్రీలంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసియాకప్ 2025లో ఇప్పటివరకు ఒక టీమ్ చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ, తిలక్‌వర్మ రాణించారు. అభిషేక్ 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్ సాయంతో 61 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో అతడికిది వరుసగా మూడో హాఫ్‌సెంచరీ. తిలక్ వర్మ 34 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సంజుశాంసన్ 23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌ల సాయంతో 39 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ (4; 3బంతుల్లో), హార్దిక్ పాండ్య (2; 3 బంతుల్లో) విఫలమయ్యారు. అక్షర్ పటేల్ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ కేవలం 31 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. తర్వాత శుభమన్ గిల్, స్కిప్పర్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా, 4, 12 పరుగులకు ఔట్ అవ్వగా, తిలక్ వర్మ శ్రీలంక బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. 34 బంతుల్లో 49 పరుగులు చేశాడు. అటు, సంజు శాంసన్ కూడా 23 బంతుల్లో 23 బంతుల్లో 39 పరుగులు చేయడం, చివరిలో అక్షర్ పటేల్ 15 బంతుల్లో 21 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. లంక జట్టులో పాథుమ్ నిస్సంక అద్భుత శతకం సాధించగా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com