ASIA CUP: ఆసియా కప్‌లో ఆ అయిదుగురిపై వేటు..?

యూఏఈ వేదికగా 2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆగస్టు 19 లేదా 20న భారత జట్టును ప్రకటించే అవకాశముంది. ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత్ బరిలో దిగడం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ అటుంచితే.. శుభ్‌మన్ గిల్‌కు చోటు కూడా దక్కకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయ్యర్‌కు మొండి చేయి తప్పదా?
ప్రస్తుత ఆసియా కప్‌నకు సంబంధించి భారతజట్టును ఆగస్టు 19 లేదా 20వ తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే శ్రేయస్ అయ్యర్‌కు స్వ్కాడ్‌లో చోటు దక్కుతుందో.. లేదో తెలియని పరిస్థితి. శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా డిసెంబర్ 2023లో టీ20ల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్ ఫార్మాట్లోనూ అతడికి యశస్వి జైస్వాల్ , శుభ్‌మన్ గిల్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. దీంతో ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్.. కేవలం వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడగలుగుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీ20 టీమ్ అద్భుతంగా రాణిస్తోంది. దీంతో జట్టు కూర్పులో పెద్దగా మార్పులు, చేర్పులు చేసే సాహసం సెలెక్టర్లు చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో.. ఈ సారి కూడా శ్రేయస్ అయ్యర్‌కు మొండి చేయి తప్పకపోవచ్చు. వాస్తవానికి పొట్టిఫార్మాట్లో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ స్థానాల గురించే అనిశ్చితి నెలకొంది. జట్టులో ఎవరుంటారు.. ఎవరు ఉండరో.. స్పష్టంగా తెలియాలంటే..నిరీక్షించాల్సిందే.
ప్రయోగాలకు సెలక్టర్లు నో
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీ20 టీమ్ అద్భుతంగా రాణిస్తోంది. దీంతో జట్టు కూర్పులో పెద్దగా మార్పులు, చేర్పులు చేసే సాహసం సెలెక్టర్లు చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో.. ఈ సారి కూడా శ్రేయస్ అయ్యర్‌కు మొండి చేయి తప్పకపోవచ్చు. వాస్తవానికి పొట్టిఫార్మాట్లో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ స్థానాల గురించే అనిశ్చితి నెలకొంది. జట్టులో ఎవరుంటారు.. ఎవరు ఉండరో.. స్పష్టంగా తెలియాలంటే.. మరి కొన్ని రోజులు నిరీక్షించాల్సిందే. టీ20 జట్టులో ప్రయోగాలు చేయడానికి బీసీసీఐ సెలెక్టర్లు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. ఇటీవలి ఇంగ్లండ్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించినా.. ఆసియా కప్ 2025లో మాత్రం ఆడే అవకాశం దక్కకపోవచ్చని సమాచారం. ఇటీవలి రోజుల్లో అన్ని ఫార్మాట్లకు గిల్‌నే కెప్టెన్‌గా చేస్తారనే వార్తలొచ్చాయి కానీ.. ప్రస్తుతానికి సారథ్య మార్పు ఉండకపోవచ్చని సమాచారం. స్టార్స్ యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు స్థానం అనుమానమే. జైస్వాల్‌ను టెస్టు క్రికెట్‌పైనే దృష్టి కేంద్రీకరించమని బీసీసీఐ సెలక్టర్లు కోరారట.
భారత టీ20 జట్టులో ప్రస్తుతం సంజు శాంసన్, అభిషేక్‌శర్మలు ఓపెనర్లుగా రాణిస్తున్నారు. తిలక్‌వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. కీపర్స్ జితేశ్ శర్మ, ధ్రువ్ జురెల్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది. ఆపై ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. కృనాల్ పాండ్యా పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025లో పెద్దగా ప్రభావం చూపించని రింకు సింగ్‌కు కూడా ఆసియా కప్‌లో అవకాశం కష్టమే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com