ASIA CUP: ఆసియా కప్‌లో నేడే మహా సంగ్రామం

ఆసియా కప్‌లో నేడు మహా సంగ్రామం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ నేడు క్రికెట్ మైదానంలో యుద్ధం చేయనున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ క్రికెటర్ల ప్రేలాపనలు ఇంకా భారతీయుల మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా ఘన విజయం సాధించాలని భారత్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. భారత్ కొట్టే దెబ్బకు పాక్ దిమ్మ తిరిగి పోవాలని కోరుకుంటున్నారు. ఈ సమరం.. పాక్‌కు గుణపాఠం చెప్పేందుకే.
ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఆసియా కప్‌లో జరుగుతోంది. ఇప్పటికే టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను యూఏఈతో ఆడింది. పసికూనపై కష్టపడకుండా అలవోకగా ఘన విజయం సాధించింది. ప్రపంచ క్రికెట్లో అభిమానులు ఆసక్తిగా చూసే మరో మ్యాచ్ భారత్ - పాకిస్థాన్ పోరు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో ఎలాంటి సంబంధాలు వద్దని డిమాండ్లు చేస్తున్న వేళ.. ఈ మ్యాచ్ జరగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 14న భారత్ - పాక్ మ్యాచ్ కావడంతో ఇప్పటినుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈక్రమంలో ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసియా కప్‌లో ఇప్పటివరకు 19 సార్లు భారత్ - పాక్ తలపడ్డాయి. టీమ్ఇండియా 10 మ్యాచుల్లో విజయం సాధించగా.. పాక్ ఆరింట్లోనే గెలిచింది. మరో మూడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఇవన్నీ గ్రూప్ స్టేజ్ లేదా సూపర్ 4 లేదా సెమీస్‌లోనే కావడం గమనార్హం.
పాక్ జట్టు ప్రేలాపనలు
ఒమాన్‌పై గెలుపు అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా తన జట్టు మీద ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు. “గత రెండు మూడు నెలలుగా మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం. ఇటీవల ట్రై నేషన్ సిరీస్ గెలిచాం. ఇక్కడ కూడా ఒమన్‌పై దుమ్మురేపాం. మా ప్లాన్‌ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే, మేము ఏ జట్టునైనా ఓడించే సామర్థ్యం కలిగి ఉన్నాం” అని చెప్పాడు.
దెబ్బ కొట్టాల్సిందే
ఆపరేషన్ సింధూర్ సమయంలో కొందరు పాక్ ఆటగాళ్లు చేసిన ప్రేలాపనలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ మ్యాచులో గెలిచి పాక్ ను చావు దెబ్బ కొట్టాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచులో గెలుపుకోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com