లవ్లీనా మ్యాచ్ కోసం అసెంబ్లీ 30 నిమిషాలు వాయిదా..!

Lovlina Borgohain File Photo
Tokyo Olympics: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ సెమీఫైనల్ చేరిన విషయం తెలిసిందే. 69 కిలోల విభాగంలో మహిళల బాక్సింగ్ విభాగంలో బరిలో దిగిన భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ సత్తా చాటింది. లవ్లీనా బొర్గొహైన్ బుధవారం టర్కీకి చెందిన ప్రపంచ ఛాంపియన్ బుసెనాజ్ సుర్మెనెలితో తలపడనుంది. అయితే బొర్గొహైన్ సెమీఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు అస్సాం ప్రభుత్వం కీలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతున్న 30 నిమిషాలపాటు అసెంబ్లీ వాయిదా వేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలను ఉదయం 11 గంటల నుంచి 30 నిమిషాలపాటు వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు స్పీకర్‌కు ప్రతిపాదనలు పంపినట్టు డిప్యూటీ స్పీకర్ డాక్టర్ నుముల్ మొమిన్ తెలిపారు. అయితే అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదు.
క్వార్టర్ ఫైనల్ మ్యాచులో చైనీస్ తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ నీన్-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో లవ్లీనా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. బుధవారం జరగబోయే కీలక మ్యాచ్‌లో గెలిస్తే ఆమె ఫైనల్‌కు వెళ్తుంది. లవ్లీనా ఈ మ్యాచ్‌లో ఓడినా ఆమెకు కాంస్య పతకం దక్కుతుంది. విజేందర్ సింగ్, మేరీ కోమ్‌లు మాత్రమే బాక్సింగ్ విభాగంలో పతకాలు సాధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com