ఆ ఆట ఆడాలంటే బికినీ వేయాల్సిందే..ఒలింపిక్స్‌లో వింత రూల్స్

Tokyo Olympics

Tokyo Olympics

Tokyo Olympics Rules: ఒలింపిక్స్‌లో క్రీడాకారులకు విధించిన వింత రూల్స్ చూస్తే ఆశ్చర్యం కలగమానదు.

Tokyo Olympics Rules: జపాన్‌లోని టోక్యో నగరంలో జులై 23 నుంచి ఆగస్టు 8 ఒలింపిక్స్ జరగనున్నాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒలింపిక్స్ క్రీడకు సర్వం సిద్ధమైంది. ప్రణాళిక ప్రకారం 2020లోనే ప్రస్తుత ఒలింపిక్స్ నిర్వహించాలి. అయితే కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వీటిని వాయిదా వేశారు. ఈ సారి జరగనున్న ఒలింపిక్స్‌లో దాదాపు 33 విభాగాల్లో 339 పతకాల కోసం ఈ సారి క్రీడాకారులు పోటీ పడనున్నారు. తొలి పతాక ప్రధాన కార్యక్రమం జులై 24న నిర్వహిస్తారు. అయితే ఒలింపిక్స్‌లో క్రీడాకారులకు విధించిన వింత రూల్స్ చూస్తే ఆశ్చర్యం కలగమానదు. ఆ రూల్స్ ఏంటో మీరు కూడా చూడండి.

-మ్యాచులో తమకు అన్యాయం జరిగిందని, జడ్జీలు తక్కువ మార్కులు వేశారని క్రీడాకారులు ధర్నాలు చేయడానికి వీల్లేదు. ఈ తరహా నిరసనలు పూర్తిగా నిషిద్ధం. మైదానాలు, కోర్టులు, బౌట్‌లు, ఈతకొలనులే కాదు.. క్రీడా గ్రామంలో ఎక్కడా తన అసంతృప్తి వెళ్లగక్కడానికి అనుమతించరు.

-స్కేటింగ్‌లో పురుషులు ఫిగర్‌ స్కేటర్లు టైట్ దుస్తులు ధరిస్తారని భావిస్తుంటాం. కానీ, వీళ్లు కేవలం ట్రౌజర్లు మాత్రమే ధరించాలనే నిబంధన ఉంది. దీనికి భిన్నంగా మహిళా స్కేటర్లు తప్పనిసరిగా స్కర్టులే వేసుకోవాలని రూల్స్ చెబుతున్నాయి.

-ఎవరైనా స్విమ్మర్‌ వరల్డ్‌ రికార్డు సృష్టిస్తే ఆటోమేటిగ్గా ఆ రికార్డు నమోదు కాదు. ఆ అథ్లెట్‌ వాళ్ల రికార్డును ఫ్యాక్స్‌ చేయాల్సి ఉంటుంది.

-అన్ని విభాగాల్లో బాక్సర్లు తప్పకుండా క్లీన్‌ షేవ్‌తో ఉండాలి. మరీ తప్పదనకుంటే పెన్సిల్‌ కట్‌ మీసాలతో బరిలో దిగడానికి మాత్రం అనుమతిస్తారు.

-జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనే జిమ్నాస్ట్‌లు వేలి గోళ్లకి రంగురంగుల నెయిల్‌ పాలిష్‌ వేసుకోవడానికి నిబంధనలు ఒప్పుకోవు. మొహానికి కలర్‌ఫుల్‌ మేకప్‌ వేసుకున్నా ఓకే గానీ గోళ్లకి మాత్రం నో!

-పతకం నెగ్గిన ఆనందంలో పోటీ పడుతున్న ఫీల్డ్‌లో.. ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడం నిషేధం. ఆ మాటకొస్తే పోటీలో ఉండే ఆటగాళ్లతోపాటు కేవలం కోచ్‌ మాత్రమే ఆ పరిసరాల్లోకి రావడానికి అనుమతి ఉంటుంది.

-స్కై డైవర్లు డైవింగ్‌ చేసేముందు బోల్డ్‌గా, ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. ఏమాత్రం అసహనంగా ఉన్నా, భయపడతున్నా.. రెండున్నర పాయింట్ల కోత విధిస్తారు.

-రెజ్లర్లు తప్పనిసరిగా తమ వెంట ఒక కర్చీఫ్‌ ఉంచుకోవాల్సిందే. దీన్ని 'బ్లడ్రాగ్‌' అంటారు. ఆటలో గాయాలు తగిలి రక్తం కారుతుంటే తుడుచుకోవడానికట.

- వాటర్‌ పోలో గేమ్‌లో ఆట మొదలవడానికి ముందే తప్పనిసరిగా క్రీడాకారుల కాలి, చేతివేళ్లు పరిశీలిస్తారు. గోళ్లు పెద్దవిగా ఉంటే కత్తిరిస్తారు. అనవసర గాయాలు కాకుండా ఉండటానికే ఇలా చేస్తారు.

-బీచ్‌ వాలీబాల్‌లో తప్పనిసరిగా బికినీలు ధరించాల్సిందే. ఆ బికినీలోని బాటమ్‌ పరిమాణం 7 సెంటీమీటర్లకన్నా మించి ఉండకూడదు. చిత్రంగా ఉంది కదూ!

- ఈక్వెస్ట్రియన్‌ అంటే గుర్రాలతో విన్యాసాలు చేసే ఆట. పోటీ ముగిసేంతవరకు ఆటగాడు నోరు తెరవకూడదు. గుర్రాన్ని కనీసం అదిలించకూడదు. నిబంధన మీరితే పోటీలో చివరి స్థానం ఇస్తారు.

-బీచ్‌ వాలీబాల్‌లో క్రీడాకారులు తమకి నచ్చిన యూనిఫాం వేసుకోవచ్చు. ఒకవేళ రెండు జట్లూ ఒకే రంగువి ఇష్టపడితే నాణెంతో టాస్‌ వేసి ఎవరు ఏం వేసుకోవాలో తేలుస్తారు. చూశారుగా ఒలింపిక్స్ లో ఎన్ని విచిత్రమైన నిబంధనలు ఉన్నాయో.. టోక్యోలో జరుగుతున్న ఈ వేడుకలను జపాన్ మినహా విదేశీయులు నేరుగా చూసేందుకు అనుమతి లేదు.

Tags

Read MoreRead Less
Next Story