Ashes Test: తొలి రోజు బౌలర్లదే, నిప్పులు చెరిగిన మార్క్‌వుడ్

యాషెస్ సిరీస్ 3వ టెస్ట్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు తమ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌పై విరుచుకుపడ్డాడు. మార్క్‌వుడ్ తన వేగంతో మొదటి రోజు 34 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి, విజృంభించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియాను మిషెల్ మార్ష్(118) తన సెంచరీతో ఆదుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది.
మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది ఆస్ట్రేలియా. పిచ్ మొదటి నుంచే పేసర్లకు అనుకూలిస్తుండటంతో పేసర్లు విజృంభించారు. బ్యాట్స్‌మెన్‌కి పరుగులు రావడం కష్టమైంది. తన తొలి ఓవర్లోనే ఓపెనర్ డేవిడ్ వార్నర్(15)ని స్టువర్ట్ బ్రాడ్ ఔట్ చేశాడు. తరువాత ఖవాజా(13)ను క్రిస్ ఓక్స్ వెనక్కి పంపాడు. అనంతరం లబుషేన్(21) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. తన 100వ టెస్ట్‌ను చిరస్మరణీయంగా మార్చుకుంటాడనుకున్న స్టీవ్ స్మిత్‌ను 22 పరుగులకే బ్రాడ్ పెవిలియన్ పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 85/4 స్థితిలో ఇంగ్లాండ్ శాసించే స్థితిలో నిలిచింది. లంచ్ సమయానికి 4 వికెట్లకు 91 పరుగులు చేసింది. 2019 తర్వాత మళ్లీ టెస్ట్ ఆడుతున్న మిచెల్ మార్ష్ పట్టుదలతో ఆడుతూ ఎడాపెడా బౌండరీలతో స్కోర్‌బోర్డుకు కదలికి తెచ్చాడు. 6తో 99 పరుగులకు చేరుకున్న మార్ష్, సింగిల్‌తో 102 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. మార్ష్ 12 పరుగుల వద్ద ఉన్నపుడు జో రూట్ క్యాచ్ మిస్ చేయడంతో ఆ అవకాశాన్ని మార్ష్ పూర్తిగా వినియోగించుకున్నాడు. అవతలి ఎండ్‌లో ట్రావిస్ హెడ్(39) పూర్తి సహకారం అందించాడు. వీరిద్దరూ లేకుంటే ఆస్ట్రేలియా 200 లోపే ఆలౌటయ్యేది. వీరు ౧౫౫ పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. మిగిలిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ అంతా కలిసి చేసింది 108 పరుగులు మాత్రమే. 300 పరుగులపై కన్నేసిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించడంతో కేవలం 23 పరుగుల వ్యవధిలో మిగిలిన 6 వికెట్లు పేకమేడలా కోల్పోయి 263 పరుగులకే ఆలౌట్ అయింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కి కూడా శుభారంభమేమీ లభించలేదు. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌ని బౌలర్లు సద్వినియోగం చేసుకోవడంతో ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 68 పరుగులు చేసి 195 పరుగులు వెనకబడి ఉంది.
మొదటి రోజు మార్ష్, మార్క్ వుడ్‌దే...
ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇంగ్లాండ్ బౌలర్ మార్ వుడ్ నిప్పులు కక్కాడు. గంటకి 152 కి.మీటర్లు, 155 కి.మీటర్ల వేగంతో బౌలింగ్ వేశాడు. 5 వికెట్లు తీసి ఆస్ట్రేలియాని కట్టడి చేశాడు. ఇక చాలా రోజుల తర్వాత టీంలోకి వచ్చిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ౧౧౮ బంతుల్లో ౧౧౮ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com