Ashes Test: భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా... 339/5
మొదటి టెస్ట్‌లో గెలిచి ఊపు మీద ఉన్న ఆస్ట్రేలియా రెండవ యాషెస్ టెస్ట్‌ని ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఓపెనర్ డేవిడ్ వార్నర్ 66 పరుగులు చేశాడు. స్టీవెన్ స్మిత్ 85 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 77 పరుగులతో అర్ధసెంచరీలతో రాణించారు.
మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదటి టెస్టు మ్యాచ్‌లో బాజ్‌బాల్ ఆటతో ఆస్ట్రేలియాను, అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. అది సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజాలు ఇన్నింగ్స్‌ని స్లోగా ప్రారంభించారు. 17 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే చేశారు. ఇంగ్లాండ్ ఫీల్డర్లు మిస్ చేసిన క్యాచ్‌లతో ఓపెనర్లిద్దరూ బతికిపోయారు. లంచ్ విరామానికి ముందు ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ ఖవాజాను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొదటి వికెట్‌కి వీరిద్దరూ 50 పరుగులు చేశారు.
లంచ్ తర్వాత అర్ధసెంచరీ చేసిన వార్నర్‌ను కూడా జోష్ టంగ్ తన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో బౌల్డ్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవెన్ స్మిత్, లబుషేన్ లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. స్టువర్ట్ బ్రాడ్‌లో ఓవర్లో 3 ఫోర్లు, స్టోక్స్ బౌలింగ్‌లో 2 బౌండరీలతో వేగం పెంచే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ 3వ వికెట్‌కి 102 పరుగులు జోడించారు. టీ విరామం అనంతరం లబుషెన్‌ను రాబిన్సన్ పెవిలియన్ పంపాడు.
102 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన స్టీవ్ స్మిత్ టెస్టుల్లో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లలో 2వ స్థానంలో నిలిచాడు. మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ వన్డే తరహాలో వేగంగా ఆడుతూ 9 ఫోర్లతో 48 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. స్టీవ్ స్మిత్, హెడ్ జోడీ 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది.
భారీ స్కోర్ సాధిస్తుందనుకున్న సమయంలో ఇంగ్లాండ్ ఏస్ బ్యాట్స్‌మెన్ జో రూట్, తన ఓవర్లో వరుసగా హెడ్, గ్రీన్ (0) లను ఔట్ చేసి ఆస్ట్రేలియా పరుగులకు అడ్డుకట్ట వేశాడు.
ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్, జో రూట్‌లు చెరో 2 వికెట్లు తీయగా, రాబిన్సన్ 1 వికెట్ తీశాడు.
మ్యాచ్‌కి అంతరాయం
మ్యాచ్ మధ్యలో ఇద్దరు పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు ఆటకు కొద్దిసేపు ఆటంకం కలిగించారు. నారింజ రంగు పౌడర్‌ని మైదానంలో చల్లారు. ఇంగ్లాండ్ కీపర్ బెయిర్ స్టో ఒక నిరసనకారుడిని, పైకెత్తి బౌండరీ అవతల వదలడం విశేషం.
స్కోర్ బోర్డ్:
1st ఇన్నింగ్స్:
ఆస్ట్రేలియా: 339/5
డేవిడ్ వార్నర్ --> 66, 8 X 4, 1 X 6
ఉస్మాన్ ఖవాజా --> 17, 2 X 4, 0 X 6
లబుషేన్ 47, 7 X 4, 0 X 6
స్మిత్ --> 85 నాటౌట్, 10 X 4, 0 X 6
హెడ్ --> 77, 14 X 4, 0 X 6
గ్రీన్ --> 0, 0 X 4, 0 X 6
అలెక్స్ కారే -->11 నాటౌట్, 10 X 4, 0 X 6
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com