Eng vs Aus: మొదటి రోజు ఆస్ట్రేలియాదే పైచేయి, 288 పరుగులకే ఆలౌట్

England vs Australia: యాషెస్ సిరీస్‌లోని చివరిదైన 5వ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు తడబడింది. మొదటి రోజు 283 పరుగులకే ఆలౌటయింది. ఇంగ్లాండ్ జట్టులో హ్యారీ బ్రూక్ చేసిన 85 పరుగులే అత్యధికం. వారికి వచ్చిన క్యాచ్ మిస్ అవకాశాల్ని కూడా వారు ఉపయోగించుకోలేకపోయారు. ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ స్టార్క్ 4 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖవాజా(25), మార్నస్ లాబుషేన్(2)లు ఉన్నారు.
మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ క్రాలే(22), బెన్ డకెట్(41)లు 4వ టెస్ట్ మ్యాచ్‌లాగానే దూకుడుగా ఆడారు. ఓవర్‌కు 5 కు పైగా రన్‌రేట్ నమోదు చేశారు. కానీ 12 ఓవర్ల తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయారు. 12వ ఓవర్లో 62 పరుగుల వద్ద బెన్ డకెట్‌ని అంపైర్ సమీక్ష ద్వారా మిషెల్ మార్ష్ వెనక్కి పంపాడు. తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ క్రాలేని కమిన్స్ వెనక్కి పంపాడు. 16వ ఓవర్లో జో రూట్(5) వికెట్ల మీదకు ఆడుకోవడంతో హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
మొయిన్ అలీ(34)తో కలిసి హ్యారీ బ్రూక్ వికెట్లను కాపాడుతూ జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో 44 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్ధ సెంచరీ తర్వాత బ్రూక్, అలీలు చెలరేగిపోయాడు. కమిన్స్ వేసిన ఓ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో సహా మొత్తం 19 పరుగులు రాబట్టారు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్‌కి శతకం భాగస్వామ్యం నమోదు చేశారు. మొయిన్ అలీని మర్ఫీ తన మొదటి ఓవర్లోనే బౌల్డ్ చేశాడు. కెప్టెన్ బెన్‌స్టోక్స్ కేవలం 3 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో బౌల్డై వెనుదిరిగాడు. తర్వాత వెనువెంటనే బెయిర్‌స్టో(4), బ్రూక్‌లు ఔటవ్వడంతో అంత వరకు భారీ స్కోర్ వైపు వెళ్లిన ఇంగ్లాండ్ స్కోర్‌బోర్డ్ 212/7 కి చేరింది. మార్క్‌వుడ్, క్రిస్ వోక్స్‌లు బౌండరీలతో బ్యాట్ ఝుళిపించడంతో స్కోర్ 250 దాటింది.
టీ తర్వాత ధాటిగా ఆడే ప్రయత్నంలో వుడ్ మర్ఫీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలవకపోవడంతో 288 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌటయింది. ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ 4 వికెట్లు తీయగా, హేజిల్‌వుడ్, మర్ఫీలు 2 వికెట్లు, కమిన్స్, మార్ష్‌లు చెరో వికెట్ తీశారు.
మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 17వ ఓవర్లో డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన వార్నర్ వోక్స్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com