CT2025: సెమీస్‌కు ఆస్ట్రేలియా

ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా జట్టు సెమీస్‌కు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. 274 పరుగుల లక్ష్య ఛేదన దిగిన ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. ఈ క్రమంలో వరుణుడు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచును రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి, ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. పట్టికలో 4 పాయింట్లు అందకున్న ఆసీస్ సెమీస్‌కు వెళ్లింది.
అద్భుతంగా ఆడిన ఆఫ్గాన్
ఈ మ్యాచులో అఫ్గాన్ బ్యాటర్లు అద్భుత పోరాటంతో ఆకట్టుకున్నారు. టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆఫ్గాన్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. సెదీఖుల్లా అటల్ (85)తో పాటు ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయి (67) దుమ్మురేపారు. ఒమర్జాయి మాత్రం సిక్సులతో రెచ్చిపోయాడు. ఏకంగా 5 సిక్సులతో ఆసీస్‌ని ఊచకోత కోశాడు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఒమర్జాయి కొట్టిన సిక్స్ ఏకంగా 103 మీటర్లుగా నమోదైంది. సెదిఖుల్లా అటల్ 85 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మొత్తంగా ఆసీస్ ముందు 274 పరుగుల టార్గెట్ ను ఆఫ్గాన్ ఉంచింది. బెన్ మూడు వికెట్లు జాన్సన్, జంపాలు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఆఫ్గాన్ ఫ్యాన్స్ ఓవరాక్షన్..
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆఫ్గానిస్థాన్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు అఫాగన్ అభిమానులు ఓవరాక్షన్ చేశారు. తమ జట్టు ఫైనల్ కి వెళ్లి.. అక్కడ భారత్ ను ఓడిస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. అతి విశ్వాసం పనికి రాదని టీమిండియా ఫ్యాన్స్ వారిపై మండిపడుతున్నారు.
అఫ్గాన్ చేతిలో ఓటమి.. కెప్టెన్ రాజీనామా
ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వన్డే, టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. శనివారం దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్ జట్టు తలపడనుంది. కెప్టెన్‌గా బట్లర్‌కు ఇదే చివరి మ్యాచ్ కానుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా లాహోర్ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 8 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com