బంగ్లా పసికూన కాదు..! చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా..బంగ్లాదేశ్ సిరీస్ కైవసం

Australia Vs Bangladesh: ఢాకా వేదికగా బంగ్లాదేశ్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆతిధ్య జట్టు భారీ విజయం సాధించింది. 10 పరుగుల తేడాతో ఆసీస్ పై చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియాను తొలి రెండు టీ20లలో ఓడించి బంగ్లా.. మూడో టీ20 కూడా గెలిచి తాము పసికూనలం కాదని క్రికెట్ ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3–0 తో సొంతం చేసుకుంది. గతంలో సౌతాఫ్రికా, టీమిండియా వంటి జట్లకు షాకిచ్చింది. తాజాగా ఆస్ట్రేలియాను దెబ్బ తీసింది.
అయితే ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గడం బంగ్లాదేశ్‌కు ఇదే ప్రథమం. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. బంగ్లా 127 పరుగులను కాపాడుకుని ఔరా అనిపించింది. కెప్టెన్ మహ్ముదుల్లా (53 బంతుల్లో 52; 4 ఫోర్లు) రాణించాడు. 128 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఘోరంగా తడబడింది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. మెక్ డెర్మట్ (41 బంతుల్లో 35 పరుగులు), మిచెల్ మార్ష్ (47 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆసీస్‌ను గెలిపించలేకపోయాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న మహ్ముదుల్లా 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' గా ఎంపికైయ్యాడు.
ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా తరఫున టి20ల్లో అరం గేట్రం చేసిన నాథన్ ఎలీస్... తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 20వ ఓవర్‌లో బౌలింగ్ వచ్చిన నాథన్ ఎలీస్ చివరి మూడు బంతుల్లో వరుసగా... మహ్ముదుల్లా, ముస్తఫిజుర్, మెహదీ హసన్‌లను అవుట్ చేసి 'హ్యాట్రిక్'ను పూర్తి చేశాడు. అరంగేట్రంలో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా నాథన్ ఎలీస్ ఘనతకెక్కాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com