Ashes Test: తీవ్రంగా గాయపడ్డ నాథన్ లియోన్, ఆస్ట్రేలియాకు ఇక కష్టమే..!

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ 2వ టెస్ట్‌లో 2వ రోజు ఆటలో ఆస్ట్రేలియా కీలక బౌలర్, ఆఫ్-స్పిన్నర్ నాథన్ లియాన్ తీవ్రంగా గాయపడ్డాడు. లార్డ్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో, రెండవ రోజు చివరి సెషన్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ క్యాచ్ పట్టబోతుండగా కాలు బెణికింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఫిజియోని రమ్మని సైగలు చేశాడు. తీవ్ర అసౌకర్యంగా ఉన్న లియాన్‌ని ఫిజియో మైదానం అవతలికి తీసుకెళ్లాడు. లియాన్ గాయపడటంతో కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ మొహంలో ఆందోళన కనిపించింది. లియోన్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. 2వ రోజు ఆట తర్వాత స్టేడియం బయట నడక కర్రలతో నడుస్తూ కనిపించాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు థర్డ్ అంపైర్ ఎరాస్మస్‌తో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ కనిపించిన లియాన్, మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేడోమని సహచరులు అంటున్నారు. అయితే గాయం తీవ్రత, ఎన్ని రోజులు విశ్రాంతి అవసరమైనటువంటి విషయాల్ని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించలేదు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. నాథన్ లియాన్ ఈ మ్యాచ్‌లో ఇక ఆడడు. తనకి కొన్నిరోజులు విశ్రాంతి అవసరం కావచ్చు. కానీ అతను బాగానే ఉన్నాడు. అతను జట్టులో లేకపోవడం మాకు చాలా లోటని వెల్లడించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో లియోన్ 13 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.
ఆస్ట్రేలియా తరఫున వరుసగా 100 మ్యాచ్‌లు ఆడిన రికార్డును సాధించబోతున్న లియాన్ రికార్డ్ ప్రమాదంలో పడింది. అతను 3వ టెస్ట్ ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. యాషెస్ సిరీస్‌లో భాగంగా 3వ టెస్ట్ జులై 6వ తేదీన ప్రారంభమవనుంది
ఆట 2వ రోజు మొదటి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 32వ సెంచరీ సాయంతో, ఆస్ట్రేలియా 416 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 4 వికెట్లకు 278 పరుగులు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com