Australian Open: చరిత్ర సృష్టించినో రోహన్ బొప్పన్న

భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మెన్స్ డబుల్స్‌ను టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో ఆస్ట్రేలియన్ ఆటగాడు ఎబ్డెన్‌తో కలిసి ఆడిన బోపన్న 7-6,7-5 ఇటలీ జోడి సిమోన్-వావాసోరి జోడీపై జయభేరి మోగించాడు. ఈ విజయంతో తొలిసారి పురుషుల డబుల్స్ గ్రాండస్లామ్ టైటిల్ గెలిచాడు. మొత్తం గంటా 39 నిముషాలు జరిగిన తుదిపోరులో ఇటలీ ద్వయం నుంచి తీవ్ర పోటీ ఎదురైనప్పటికీ తన అనుభవంతో బోపన్న జోడీ విజయాన్ని అందుకుంది. ఒకదశలో 3-4తేడాతో రెండో సెట్‌లో వెనకబడిన బోపన్న జోడీ తర్వాత పుంజుకుని గెలిచింది. ఈ విజయంతో 43 వయస్సులో గ్రాండ్‌స్లమ్ టైటిల్ నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా రోహన్ బోపన్న ఘనత సాధించాడు. దిగ్గజ ఆటగాళ్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి తర్వాత మెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత టెన్నిస్ ఆటగాడిగా బోపన్న నిలిచాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com