Avani Lekhara : పారాఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళ 'లేఖరా'

టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఇవాళ ఒక్కరోజే 4 పతకాలు సాధించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవనీ లేఖరా ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి బంగారు పతకాన్ని కౌవసం చేసుకున్నారు. 249.6 రికార్డుతో గోల్డ్ మెడల్ సాధించగా.. చైనాకు చెందిన కుయ్‌పింగ్ 248.9తో రజత పతకాన్ని గెలుచుకుంది. అటు డిస్కస్ త్రోలో యోగేశ్ కతునియా రజతం సాధించారు. జావెలిన్ త్రోలో భారత్ అథ్లెట్లు రజతం, కాంస్య పతకాలు సాధించారు. దేవంద్ర ఝజారియా రజతం సాధించగా.. సుందర్‌సింగ్ కాంస్య పతకాన్ని సాధించారు.
పారాలింపిక్స్ విజేతలకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. అవనీ లేఖరా, యోగేశ్ కతునియాను అభినందించారు. అటు భారత అథ్లెట్లు పతకాల గెలుచుకోవడంతో దేశంలో సంబరాలు మొదలయ్యాయి. యోగేశ్ కుతునియా స్వగ్రామంలో స్థానికులు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఇక పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు 7 పతకాలు సాధించారు భారత అథ్లెట్లు. నిన్న మూడు పతకాలు సాధించారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పురుషుల హైజంప్ పోటీల్లో టీ47 కేటగిరిలో నిషాద్‌కుమార్ 2.6 మీటర్ల జంప్‌చేసి రజతం సాధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com