Bajrang Punia : భారత్ ఖాతాలో మరో పతకం..!

X
By - Gunnesh UV |7 Aug 2021 4:30 PM IST
టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. కాంస్యం కోసం జరిగిన పోటీలో భారత రెజ్లర్ భజరంగ్ పునియా విజయం సాధించాడు
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది.. పురుషుల రెజ్లింగ్‌లో భజరంగ్ పునియా కాంస్య పతకం సాధించాడు.. కజకిస్తాన్ రెజ్లర్ జకోవ్‌ను భజరంగ్ పునియా మట్టి కరిపించాడు. పురుషుల 65 కేసీల విభాగంలో కాంస్యం కోసం జరిగిన పోరులో 8-0 తేడాతో భజరంగ్ పునియా ఘన విజయాన్ని సాధించాడు. మ్యాచ్ ఆసాంతం ఏకపక్షంగానే సాగింది.. భజరంగ్ పట్టుతో ప్రత్యర్థి వ్యూహాలు మొత్తం చిత్తయిపోయాయి.. చివరకు 8-0 తేడాతో భజరంగ్ విజయాన్ని అందుకున్నాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్‌కు ఆరు పతకాలు వచ్చాయి. భారత్ సాధించిన ఆరు పతకాల్లో రెండు రజత పతకాలు ఉండగా.. నాలుగు కాంస్యాలు వున్నాయి..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com