BANANA SCAM: 'బ­నా­నా స్కా­మ్'­తో బీ­సీ­సీ­ఐ­కి షాక్

BANANA SCAM: బ­నా­నా స్కా­మ్­తో బీ­సీ­సీ­ఐ­కి షాక్
X

ఆసి­యా కప్ 2025 ప్రా­రం­భ­మైన తొలి రోజే భారత క్రి­కె­ట్ బో­ర్డు(బీ­సీ­సీఐ)కి ఊహిం­చ­ని షాక్ తగి­లిం­ది. ఉత్త­రా­ఖం­డ్ క్రి­కె­ట్ అసో­సి­యే­ష­న్(సీ­ఏ­యూ)లో జరి­గి­న­ట్లు ఆరో­పిం­చ­బ­డు­తు­న్న రూ.12 కో­ట్ల కుం­భం­కో­ణం­పై వి­చా­రణ జరి­పిం­చా­ల­ని ఉత్త­రా­ఖం­డ్ హై­కో­ర్టు బీ­సీ­సీ­ఐ­కి నో­టీ­సు­లు జారీ చే­సిం­ది. ఈ కుం­భ­కో­ణం­లో రూ.35 లక్ష­లు కే­వ­లం అర­టి­పం­డ్ల­పై ఖర్చు చే­శా­ర­నే ఆరో­ప­ణ­లు సం­చ­ల­నం సృ­ష్టి­స్తు­న్నా­యి.

అసలేం జరిగింది?

ఉత్త­రా­ఖం­డ్‌­కు చెం­దిన సం­జ­య్ రా­వ­త్ అనే వ్య­క్తి హై­కో­ర్టు­లో ఓ పి­టి­ష­న్ దా­ఖ­లు చే­శా­డు. ఆ పి­టి­ష­న్‌­లో ఉత్త­రా­ఖం­డ్ క్రి­కె­ట్ అసో­సి­యే­ష­న్(సీ­ఏ­యూ) ప్ర­భు­త్వ ని­ధు­ల­ను దు­ర్వి­ని­యో­గం చే­స్తోం­ద­ని ఆరో­పిం­చా­డు. ఆట­గా­ళ్ల అభి­వృ­ద్ధి, క్రి­కె­ట్ ని­ర్వ­హణ కోసం కే­టా­యిం­చిన రూ.12 కో­ట్ల­ను అక్ర­మం­గా ఖర్చు చే­శా­ర­ని పే­ర్కొ­న్నా­డు. ఆట­గా­ళ్ల­కు ఎలాం­టి సదు­పా­యా­లు కల్పిం­చ­డం లే­ద­ని కూడా సం­జ­య్ రా­వ­త్ ఆరో­పిం­చా­డు. పి­టి­ష­న­ర్ సం­జ­య్ రా­వ­త్ చే­సిన ఆరో­ప­ణ­లు చాలా తీ­వ్ర­మై­న­వి. ఆట­గా­ళ్ల కోసం కే­టా­యిం­చిన రూ.12 కో­ట్ల ప్ర­భు­త్వ ని­ధు­ల­ను సీ­ఏ­యూ దు­ర్వి­ని­యో­గం చే­సిం­ద­ని పి­టి­ష­న­ర్ ఆరో­ప­ణ­లు చే­శా­డు. సీ­ఏ­యూ ఆడి­ట్ రి­పో­ర్ట్‌ ప్ర­కా­రం.. ఆట­గా­ళ్ల­కు రూ.35 లక్షల వి­లు­వైన అర­టి­పం­డ్లు తి­ని­పిం­చి­న­ట్లు పే­ర్కొ­న్నా­డు. ఈ ఆరో­పణ ఇప్పు­డు 'బ­నా­నా స్కా­మ్'­గా ప్ర­చా­రం­లో ఉంది.ఆహా­రం, క్యాం­పుల పే­రు­తో కో­ట్లా­ది రూ­పా­యల ఖర్చు చూ­పిం­చి­న­ప్ప­టి­కీ, వా­స్త­వం­గా అంత ఖర్చు చే­య­లే­ద­ని ఆరో­పిం­చా­డు. అసో­సి­యే­ష­న్ తమ సొంత చా­ర్టె­డ్ అకౌం­టెం­ట్ ద్వా­రా కా­కుం­డా, బయటి సీఏ ద్వా­రా ఆడి­ట్ చే­యిం­చు­కుం­ద­ని, దీని ద్వా­రా అక్ర­మా­ల­ను దా­చి­పె­ట్టే ప్ర­య­త్నం జరి­గిం­ద­ని పి­టి­ష­న­ర్ ఆరో­పిం­చా­డు. పి­టి­ష­న్‌­పై వి­చా­రణ జరి­పిన జస్టి­స్ మనో­జ్ కు­మా­ర్ తి­వా­రీ ధర్మా­స­నం.. బనా­నా స్కా­మ్‌­పై స్ప­ష్టత ఇవ్వా­ల­ని బీ­సీ­సీ­ఐ­కి నో­టీ­సు­లు జారీ చే­సిం­ది. ఇది క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది.

Tags

Next Story