Ind-Ban Cricket: చివరి వన్డేలో ఓటమి పాలైన భారత్

బంగ్లాదేశ్(Ban)తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో చివరి వన్డేలో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. రెండో వన్డేలో తృటిలో ఓటమి నుంచి తప్పిచుకున్న జట్టు ఈ వన్డేలో బంగ్లాదేశ్ స్పిన్నర్ల ధాటికి పరాజయం పాలయ్యారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ వైట్ వాష్ తప్పించుకుంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 2వ ఓవర్లోనే స్మృతి మంధనా(1) వికెట్ కోల్పోయింది. ఆఫ్ స్విన్ ఆడటంలో ఇబ్బందులు ఎదుక్కొంటున్నన మంధనా సుల్తానా బౌలింగ్‌లో ఔటైయింది. 4వ ఓవర్లో మరో ఓపెనర్ షెఫాలీ(11) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత జెమీమా రోడ్రిగ్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(40)లు బౌండరీలతో వేగం పెంచారు. వీరిద్దరూ మూడవ వికెట్‌కి 45 పరుగులు చేశారు. 12వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి జెమీయా స్టంపౌట్‌గా వెనుదిరిగింది. స్కోర్ వేగం పెంచే క్రమంలో హర్మన్ ప్రీత్ కూడా జెమీయా తరహాలో స్టంపౌంట్‌గా వెనుదిరిగింది. 91/3 గా ఉన్న భారత్ ఇన్నింగ్స్ ఆ తర్వాత పేకమేడలా కూలిపోయింది. తర్వాత కేవలం 11 పరుగులు జోడించి 6 వికెట్లు కోల్పోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో రబయా ఖాన్ 3 వికెట్లతో భారత్‌ను దెబ్బతీసింది.
స్పిన్ పిచ్‌కి అనుకూలిస్తుండటంతో భారత్‌కు కూడా ఆశలు కోల్పోలేదు. దీనికి తగ్గట్లుగానే 2వ ఓవర్లో మిన్ను మణి భారత్‌కు తొలి వికెట్ అందించింది. 4వ ఓవర్లో మరో వికెట్ తీయడంలో 12 పరుగులకే 2వ వికెట్ కోల్పోయి, 2వ వన్డే ఫలితం తప్పదా అన్పించింది. తర్వాత వచ్చిన షమీమా సుల్తానా(42), నిగర్ సుల్తానాలు నిలకడగా ఆడటంతో 12 ఓవర్లకు 62 పరుగులు చేసింది. తర్వాత 7 పరుగుల వ్యవధిలోనే మరో 2 వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న షమీమా సుల్తానా లేని పరుగు కోసం ప్రయత్నించి 85 పరుగుల వద్ద 5వ వికెట్‌గా వెనుదిరిగింది. నహీదా అక్తర్, రీతు మోనిలు బౌండరీలు, సింగిల్స్‌తో లక్ష్యాన్ని 10 బంతులు ఉండగానే ఛేదించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, దేవికా వైద్యలు చెరో 2 వికెట్లు తీయగా, జెమీయా 1 వికెట్ తీసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com