టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ వరల్డ్ రికార్డ్

టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఏకంగా 546 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 21వ శతాబ్దంలో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. టెస్టు క్రికెట్‌లో ఓవరాల్‌గా చూసుకుంటే 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 675 పరుగుల తేడాతో విజయం సాధించి అగ్రస్థానంలో ఉంది. ఇక 1934లో ఇంగ్లాండ్‌పై ఆసీస్ 562 పరుగుల తేడాతో గెలుపొంది రెండో స్థానంలో ఉంది.
ఇక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. నజ్ముల్ హుస్సేన్ షాంటో 146 పరుగులతో సత్తా చాటగా.. మహ్మదుల్లా హసన్ 76, ముష్పీకర్ రహీమ్ 47, హసన్ మిరాజ్ 48 రాణించడంతో 382 పరుగులు చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గానిస్థాన్ 146 పరుగులకే కుప్పకూలింది. అప్సర్ జాజయ్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగుల ఆధిక్యం సంపాందించిన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారీ స్కోరు చేసింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో 124 పరుగులతో మరోసారి శతకంతో విరుచుకుపడ్డాడు. మోమినుల్ హక్ 121 పరుగులు చేయడంతో 425/4 వద్ద బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైన అఫ్గానిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో అంతకంటే తక్కువ స్కోరుకే చేతులేత్తేసింది. తస్కిన్ అహ్మద్ 4 వికెట్లు, షారిఫుల్ ఇస్లాం 3 వికెట్లతో చెలరేగడంతో అఫ్గాన్ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాదేశ్ రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com