BAN-AFG: ఎట్టకేలకు గెలిచిన బంగ్లాదేశ్, సిరీస్ ఆఫ్ఘాన్ వశం

ఆఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న త్రీ వన్డేల సిరీస్‌లో బంగ్లా చివరి వన్డేలో గెలిచింది. చివరి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి వైట్ వాష్ కాకుండా తప్పించుకుంది. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం 4 వికెట్లు తీసి కెరీర్‌లో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. త్రీ వన్డేల సిరీస్‌ని 2-1 తేడాతో ఆఫ్ఘనిస్తాన్ సొంతం చేసుకుంది. సిరీస్‌లో 8 వికెట్లు తీసిన ఫజల్ ఫారూఖీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.
127 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 23.3 ఓవర్లలోనే ఛేదించారు. మొదటి రెండు వన్డేల్లో తడబడిన బంగ్లా బ్యాట్స్‌మెన్ ఈ వన్డేలో కూడా మొదట తడబడ్డారు. 2వ ఓవర్లోనే ఓపెనర్ నయీమ్‌ని ఫారూఖీ బౌల్డ్ చేశాడు. 7వ ఓవర్లలో షాంటోని కూడా బౌల్డ్ చేసి వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన షకీబుల్ హసన్(39), లిట్టన్ దాస్‌లు అడపాదడపా బౌండరీలతో స్కోర్‌బోర్డ్‌ను ముందుకు నడిపించారు. 18వ ఓవర్లో షకీబ్‌ను స్పిన్నర్ నబీ ఔట్ చేశాడు. అయినా అప్పటికే బంగ్లా ఛేదించాల్సిన పరుగులు 38 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే. లిట్టన్ దాస్(53 నాటౌట్) ఒక ఫోర్, బౌండరీతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. బంగ్లా బ్యాటర్ హ్రిదోయ్ 23 ఓవర్ మూడవ బంతిని ఫోర్‌కి తరలించి బంగ్లాకి గెలుపు పరుగులు సాధించాడు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన ఆప్ఘాన్ బ్యాట్స్‌మెన్ పేలవంగా ఆడారు. బంగ్లా బౌలర్ షోరిఫ్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఓపెనర్ ఇబ్రహీం(1), తరువాత వచ్చిన రహ్మత్(0) లను వెనక్కి పంపాడు. ఆప్ఘాన్ జట్టుకు ఏ దశలోనూ మంచి భాగస్వామ్యాలు నమోదు కాలేదు. 8.2 ఓవర్లలో కేవలం 15 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఒమర్జాయ్ కొద్దిపాటి మెరుపులు మెరిపించాడు కాబట్టి ఆఫ్ఘాన్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 45.2 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటయింది. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం 4 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాంలు 2 వికెట్లు, హసన్ మిర్జా, షకిబుల్ హసన్‌లు చెరో వికెట్ తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com